హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కేశంపేటలోని ఓ ఫాంహౌజ్‌లో ముజ్రా పార్టీపై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ముజ్రా పార్టీలో  పాల్గొన్న  11 మంది యువకులు,  ఐదుగురు యువతులను పోలీసులు అరెస్ట్ చేశారు.

రంగారెడ్డి జిల్లాలోని కేశంపేటలోని ఫాం హౌజ్ లో ముజ్రా పార్టీ నిర్వహిస్తున్నారు. ముజ్రా పార్టీ నిర్వహిస్తున్న విషయమై పక్కా సమాచారం  అందుకొన్న  ఎస్ఓటీ పోలీసులు మంగళవారం నాడు దాడులు నిర్వహించారు.

ఫాంహౌజ్‌లో  ముజ్రా పార్టీలు గతంలో కూడ చోటు చేసుకొన్నాయనే సమాచారం పోలీసులకు దొరికింది.  సుమారు రూ. 22 వేలు,  రెండు కార్లు, 1 బైక్ ను  పోలీసులను స్వాధీనం చేసుకొన్నారు. ముజ్రా పార్టీలో 11 మంది యువకులను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.వీరితో పాటు ఐదుగురు యువతులు కూడ ఈ పార్టీలో ఉన్న విషయాన్ని గుర్తించి వారిని  అదుపులోకి తీసుకొన్నారు.

ఐదుగురు యువతుల్లో  ఇద్దరు ముంబై నుండి, ముగ్గురు హైద్రాబాద్‌ నుండి వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. ముజ్రా పార్టీ నిర్వహణలో పాల్గొన్న యువతీ యువకులు  డిగ్రీ, బిటెక్ చదివేవారేనని గుర్తించారు. 

ఈ వార్త చదవండి

హైద్రాబాద్‌లో ముజ్రా పార్టీ: మత్తులో బాలికపై రేప్, ఆరుగురి అరెస్ట్