హైద్రాబాద్‌లో ముజ్రా పార్టీ: మత్తులో బాలికపై రేప్, ఆరుగురి అరెస్ట్

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 2, Sep 2018, 10:57 AM IST
police busted mujra party in hyderabad, 6 arrested
Highlights

హైద్రాబాద్‌లోని  జూపార్క్‌కు సమీపంలోని  ఓ లాడ్జీలో  ముజ్రా పార్టీ నిర్వహిస్తున్న ఆరుగురు నిందితులను పోలీసులు  అరెస్ట్ చేశారు

హైదరాబాద్: హైద్రాబాద్‌లోని  జూపార్క్‌కు సమీపంలోని  ఓ లాడ్జీలో  ముజ్రా పార్టీ నిర్వహిస్తున్న ఆరుగురు నిందితులను పోలీసులు  అరెస్ట్ చేశారు. ముజ్రా పార్టీ సందర్భంగా  ఓ బాలికపై  నిందితులు  అత్యాచారానికి పాల్పడ్డారు.  ముజ్రా పార్టీ సందర్భంగా  పట్టుబడిన ముగ్గురు అమ్మాయిలను  పోలీసులు రెస్క్యూ హోంకు తరలించారు.

హైద్రాబాద్‌లోని కాలాపత్తర్‌కు చెందిన మహ్మద్‌ సమి తన పుట్టినరోజు సందర్భంగా మరో ఐదుగురు స్నేహితులతో కలిసి ఓ లాడ్జిలో ముజ్రా పార్టీ ఇచ్చాడు. ఈ సమాచారం అందుకొన్న పోలీసులు  లాడ్జీపై దాడి చేశారు.  ముజ్రా పార్టీలో పాల్గొంటున్న మీ, అతని స్నేహితులు ఖుద్దూస్‌, ముక్తార్‌, సయ్యద్‌ అహ్మద్‌, మామా షాజిర్‌లపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

పార్టీ సందర్భంగా  మత్తులో  ఓ బాలికపై కూడ అత్యాచారానికి పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు.ముజ్రా పార్టీ ప్రాంతంలో ఉన్న  ముగ్గురు అమ్మాయిలను పోలీసులు నింబోలిఅడ్డలోని రెస్క్యూ హోంకు తరలించారు.

నిందితులపై నిర్భయ చట్టంతో పాటు, నిబంధనలను ఉల్లంఘించి హుక్కా సేవించినందుకు  కోక్టా చట్టం కింద కూడ కేసులు  నమోదు చేసినట్టు  పోలీసులు తెలిపారు.


 

loader