అక్రమంగా మహిళా నిర్భంధం: ఐదుగు జీఎస్టీ అధికారులపై హైద్రాబాద్ పోలీసుల కేసు

సెర్చ్ ఆపరేషన్ పేరుతో అక్రమంగా నిర్భంధించారని మహిళా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐదుగురు జీఎస్టీ అధికారులపై హైద్రాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.జాతీయ మహిళా కమిషన్ ఆదేశం మేరకు హైద్రాబాద్ పోలీసులు కేసు పెట్టారు.
 

Hyderabad Police booked  Five GST officials for illegally detaining  Woman

హైదరాబాద్:ఓ మహిళను అక్రమంగా నిర్భంధించారనే నెపంతో ఐదుగురు జీఎస్టీ అధికారులపై హైద్రాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.Hyderabad కు చెందిన వ్యాపారవేత్త Satya Sredhar Reddy  ఇంట్లో 2019 లో GST అధికారులు సోదాలు నిర్వహించారు.  ట్యాక్స్ చెల్లింపు విషయమై సోదాలు చేశారు. సోదాలు ముగిసిన తర్వాత శ్రీధర్ రెడ్డి బార్యను అక్రమంగా నిర్బంధించారని శ్రీధర్ రెడ్డి భార్య జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది.

 ఈ ఫిర్యాదుపై జాతీయ Women Commission కమిషన్ స్పందించింది. ఈ విషయమై బాధితురాాలికి న్యాయం చేయాలని ఆదేశించింది. జాతీయ మహిళా కమిషన్ ఆదేశం మేరకు బాధితురాలి నుండి హైద్రాబాద్ Police  సమాచారం సేకరించారు.ఈ సమాచారం ఆధారంగా పోలీసులు కేసు ఐదుగురు జీఎస్టీ అధికారులపై కేసు నమోదు చేశారు.

జీఎస్టీకి చెందిన చెన్నై జీఎస్టీ ప్రిన్సిపల్ కమిషనర్ ఎం. శ్రీనివాస్, ఆనంద్ కుమార్, బొల్లినేని శ్రీనివాస గాంధీ, చిలుకా సుధారాణి, ఇస్‌బెల్లా బుట్టో లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సోదాల పేరుతో శ్రీధర్ రెడ్డి భార్య రాఘవి రెడ్డిని అక్రమంగా నిర్భంధించారు. ఈ విషయమై  బాధితురాలు రాఘవిరెడ్డి జాతీయ మహిళా కమిషన్ ను ఆశ్రయించింది. 2019 ఫిబ్రవరి 27న తమ ఇంట్లో సోదాల పేరుతో జీఎస్టీ అధికారులు తనను నిర్భంధించారని పేర్కొన్నారు.

ఈ సోదాల సమయంలోనే జీఎస్టీ అధికారులు తమను లంచం కూడా అడిగారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ లంచం డబ్బులను తాము పంచుకొంటామని కూడా జీఎస్టీ అధికారులు చెప్పారని ఆమె వివరించారు..ఈ ఫిర్యాదును పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది. దీంతో హైద్రాబాద్ పోలీసులు బాధితురాలి నుండి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios