హైదరాబాద్‌ శివార్లలోని మేడిపల్లిలో ఇద్దరు నకిలీ డాక్టర్ల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు 2002 నుంచి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 

హైదరాబాద్‌ శివార్లలోని మేడిపల్లిలో నకిలీ డాక్టర్ల బండారం బయటపడింది. సులేఖా రాణి, గిరిధర్ అనే దంపతులు 2002 నుంచి డాక్టర్లుగా చెలామణీ అవుతున్నారు. గైనకాలజీ, డయాబెటిస్‌కు వైద్యం చేస్తామంటూ వీరు మోసాలకు పాల్పడుతున్నారు. పలు చోట్ల క్లినిక్‌లు పెట్టి వైద్యం అందిస్తున్నారు. అంతేకాదు ప్రతి ఆరు నెలలకోసారి మకాం మారుస్తూ మోసం బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వీరి గురించి పోలీసులకు సమాచారం అందడంతో .. మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు వీరిని అరెస్ట్ చేసి, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred