హైదరాబాద్: నిరుద్యోగులకు  ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిన కంపెనీని  సైబర్ క్రైమ్ పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

నౌకరీ డాట్ కామ్ ద్వారా నిరుద్యోగులకు ఈ ముఠా గాలం వేసింది. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని  నిరుద్యోగులను బురిడీ కొట్టించింది. ఉద్యోగాల కోసం వందలాది మంది యువత  ధరఖాస్తు చేసుకొన్నారు.

ధరఖాస్తు చేసుకొన్న వారికి ఫోన్లు చేసి ఈ ముఠా డబ్బులు వసూలు చేసింది. లక్నోలో  కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఈ కాల్ సెంటర్ ద్వారా నిరుద్యోగులకు ఫోన్లు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.

నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేసి  వారికి ఉద్యోగాలు ఇప్పించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు.  లక్నోలోని  కాల్ సెంటర్ ను సైబర్ క్రైమ్ పోలీసులు సీజ్ చేశారు. ఈ ముఠాలోని ముగ్గురిని  సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.