హైదరాబాద్: హైద్రాబాద్ హైటెక్ సిటీ ఐకియా చౌరస్తా వద్ద  ఈ నెల 12వ తేదీ రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతికి కారణమైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కాశీవిశ్వనాథ్ ను సోమవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.

also read:హైటెక్ సిటీ కారు ప్రమాదం: చిక్కుల్లో కుమారుడు, ఎమ్మెల్యే కాటసాని వివరణ

హైటెక్ సిటీ వద్ద బైక్ పై వెళ్తున్న భార్యాభర్తలను అతివేగంగా కారును డ్రైవ్ చేస్తూ కాశీవిశ్వనాథ్ ఢీకొట్టాడు. ఈ ఘటనలో భర్త అక్కడికక్కడే మరణించగా, అతని భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.

రోగ్ పబ్ లో మద్యంతో పాటు గంజాయిని  కాశీ విశ్వనాథ్ తీసుకొన్నాడు.గంజాయి మత్తులో అత్యంత వేగంగా కాశీ విశ్వనాథ్ కారు నడిపినట్టుగా దర్యాప్తులో పోలీసులు తేల్చారు.

also read:హైద్రాబాద్ హైటెక్ సిటీలో ప్రమాదం: పోలీసుల విచారణలో సంచలన విషయాలు

రాయలసీమకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంరెడ్డి తనయుడు ఓబుల్ రెడ్డి పేరున ఈ కారు ఉంది. రిపేర్ కోసం కారును హైద్రాబాద్ గ్యారేజీలో ఇచ్చినట్టుగా ఎమ్మెల్యే కాటసాని రాంరెడ్డి ప్రకటించారు.

ఈ కేసుతో తన కొడుకుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తన కొడుకు స్నేహితుడు ఈ కారును తీసుకొచ్చి ఇస్తానని చెప్పాడన్నారు. గ్యారేజీ నుండి తీసుకొన్న తర్వాత ఆ ప్రమాదం చోటు చేసుకొందన్నారు.