హైదరాబాద్: హైద్రాబాద్ హెటెక్ సిటీలో గురువారం నాడు రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూశాయి.

మద్యం మత్తులో కారును డ్రైవ్ చేయడంతో  బైక్ పై వెళ్తున్న భార్యాభర్తలను ఢీకొట్టారు.ఈ ఘటనలో భర్త మరణించగా, భార్య చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ఈ ప్రమాదం జరిగిన జరిగిన సమయంలో కాశీవిశ్వనాథ్, కౌశిక్ లు కారును వదిలి పారిపోయారు. కారు ప్రమాదం జరిగిన తర్వాత విశ్వనాథ్, కౌశిక్ లు ఓయో హోటల్ రూమ్ లో ఉన్నారని పోలీసులు గుర్తించారు.

also read:పీకలదాకా తాగి.. బైక్ ని ఢీకొట్టిన బెంజ్ కారు

ఈ ప్రమాదానికి కారణమైన ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.ప్రమాదం జరిగిన చోటునే వీరిద్దరూ కూడ కారును వదిలి వెళ్లారు. కారును రాయలసీమకు చెందిన ఓ నేతదిగా పోలీసులు భావిస్తున్నారు. కారు యజమానికి నోటీసులు పంపాలని పోలీసులు భావిస్తున్నారు.

ఈ కారు యజమానికి నోటీసులు పంపడం ద్వారా ఈ ప్రమాదానికి కారణమైన వారిని పట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.జూబ్లీహిల్స్ పబ్ లో అర్ధరాత్రి వరకు మద్యం తాగిన విశ్వనాథ్, కౌశిక్ లు తిరిగి వస్తూ ప్రమాదం చేశారని పోలీసులు గుర్తించారు.

గతంలో కూడ విశ్వనాథ్ పై ఆబిడ్స్ పోలిస్ స్టేషన్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ కేసు నమోదైన విషయాన్ని పోలీసులు గుర్తించారు.