హైదరాబాద్: షేక్‌పేట్ ఎమ్మార్వో, ఆర్ఐ, బంజారాహిల్స్ ఎస్ఐ ఏసీబీ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకొంది.ఈ కేసులో ఏసీబీని ఆశ్రయించిన సయ్యద్ అబ్దుల్ ను పోలీసులు ఆదివారం నాడు అరెస్ట్ చేశారు. ఫోర్జరీ సంతకాలతో ప్రభుత్వ భూమిని కాజేసేందుకు ప్రయత్నించడంతో గుర్తించడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. 

పాత బస్తీకి చెందిన సయ్యద్ ఖాలీద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో 1.20 ఎకరాల స్థలం ఉందని.. సర్వే చేయాలని 2019 డిసెంబర్ లో షేక్ పేట తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు.అధికారులు స్పందించకపోవడంతో ఆ భూమి తనదేనంటూ 5 నెలల క్రితం బోర్డులు ఏర్పాటు చేశారు. 

ప్రభుత్వ భూమిని ఆక్రమించారంటూ తహశీల్దార్ సుజాత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఖాలీద్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ కొనసాగుతుండగానే.. కేసు మాఫీ చేస్తానంటూ ఎస్ఐ రవీంద్రనాయక్ డబ్బు డిమాండ్ చేశారు. రూ.50 లక్షలు ఇస్తే భూమి మీదేనంటూ రాసిస్తానని ఆర్ఐ నాగార్జున సైతం ఖాలీద్ కు చెప్పారు. ఈ కేసు మాఫీకి డబ్బులు డిమాండ్ చేశారు రెవిన్యూ అధికారులు. 

ఖాలీద్ పై ఈ ఏడాది జనవరిలో కేసు నమోదైన వెంటనే ఎస్ఐ రవీంద్రనాయక్ కేసు మాఫీ చేస్తానని రూ.3 లక్షలు డిమాండ్ చేసి.. ఫిబ్రవరిలో రూ.లక్ష తీసుకున్నారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు ఖాలీద్ పై ఏప్రిల్ లో రెండోసారి కేసు నమోదైంది. ఈ కేసు మాఫీ కోసం పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేశారని ఖలీద్ ఏసీబీని ఆశ్రయించాడు. ఈ ఏడాది జూన్ 7వ తేదీన ఆర్ఐ నాగార్జున రెడ్డి, బంజారాహిల్స్ ఎస్ఐ లను ఏసీబీ అరెస్ట్ చేసింది.

ఆ తర్వాత విచారించిన ఏసీబీ అధికారులు షేక్ పేట ఎమ్మార్వో ను కూడ అరెస్ట్ చేశారు. ఇదే కేసులో మనోవేదనకు గురైన షేక్ పేట ఎమ్మార్వో భర్త అజయ్ మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు షాక్ తిన్నారు. ప్రభుత్వ భూమిని ఫోర్జరీ సంతకాలతో కొట్టేసేందుకు ప్రయత్నించినట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు ప్రయత్నించారు. దర్యాప్తులో ఈ విషయాలను గుర్తించిన పోలీసులు సయ్యద్ ను అరెస్ట్ చేశారు.