హైద్రాబాద్ శంషాబాద్ వద్ద నకిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో ఏడుగురు సభ్యులున్నారు. నిందితుల నుండి 1200 నకిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
హైదరాబాద్: హైద్రాబాద్ శంషాబాద్ లో నకిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను మంగళవారం నాడు ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో ఏడుగురు సభ్యులున్నారని పోలీసులు తెలిపారు.
Hyderabad శంషాబాద్ సమీపంలో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారనే కచ్చితమైన సమాచారం పోలీసులకు అందింది.ఈ సమాచారం ఆధారంగా ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. Rta ఎం వ్యాలెట్ నుండి వివరాలను సేకరించి నకిలీ Registration సర్టిఫికెట్లను తయారు చేస్తున్నారు ముఠా సభ్యులు .1200 నకిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లతో పాటు చిప్స్‌తో కూడిన పీవీసీ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
