ప్లాస్మా పేరుతో మోసం: సందీప్‌ను అరెస్ట్ చేసిన హైద్రాబాద్ పోలీసులు

కరోనా భయాన్ని ఆసరాగా చేసుకొని ఒక్కొక్కరు ఒక్కో రకంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.  ప్లాస్మా కావాలనుకొనేవారి నుండి డబ్బులు వసూలు చేసిన రెడ్డి సందీప్ అనే వ్యక్తిని హైద్రాబాద్ పోలీసులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు.

hyderabad police arrested Reddy sandeep for cheating


హైదరాబాద్: కరోనా భయాన్ని ఆసరాగా చేసుకొని ఒక్కొక్కరు ఒక్కో రకంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.  ప్లాస్మా కావాలనుకొనేవారి నుండి డబ్బులు వసూలు చేసిన రెడ్డి సందీప్ అనే వ్యక్తిని హైద్రాబాద్ పోలీసులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు.

also read:కరోనా హెల్త్ బులెటిన్‌: ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు

కరోనా నుండి కోలుకొన్నవారి ప్లాస్మా ద్వారా కరోనా రోగులకు చికిత్స చేస్తే మంచి పలితాలు వస్తున్నట్టుగా వైద్యులు చెబుతున్నారు.దీంతో ప్లాస్మా కోసం డబ్బులు వసూలు చేసి మోసం చేశాడు సందీప్.

also read:వర్షంలోనే స్ట్రెచర్‌పై మహిళ డెడ్ బాడీ: పోలీసుల చొరవతో చివరికిలా...

ప్లాస్మా కావాలనుకొనేవారికి ప్లాస్మా ఇస్తామని సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు సందీప్. ప్లాస్మా కోసం తనను సంప్రదించాలని ఆయన కోరాడు.  అంతేకాదు తన నెంబర్ ను కూడ ఇచ్చాడు. ప్లాస్మా కోసం తనను కాంటాక్ట్ చేసిన వారిలో ఒక్కొక్కరి నుండి రూ. 5 వేల నుండి రూ. 17 వేలు వసూలు చేశాడు. కానీ, ఒక్కరి కూడ ప్లాస్మా ఇవ్వలేదు.

ఇప్పటివరకు సందీప్ 200 మంది నుండి డబ్బులు వసూలు చేశాడు. సందీప్ గురించి పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో నిందితుడు సందీప్ ను పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. నిందితుడు  శ్రీకాకుళం జిల్లాకు చెందినవాడు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios