Asianet News TeluguAsianet News Telugu

కమీషన్ కోసమే రియల్టర్ విజయ బాస్కర్ రెడ్డి హత్య, నరేందర్ అరెస్ట్: సీపీ అంజనీ కుమార్

అల్వాల్ కు చెందిన రియల్టర్ విజయ భాస్కర్ రెడ్డి హత్య కేసులో నరేందర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కమీషన్ కోసమే  విజయ భాస్కర్ రెడ్డిని హత్య చేసినట్టుగా హైద్రాబాద్ సీపీ చెప్పారు.
 

Hyderabad Police Arrested Narender For Killing  Realtor Vijay bhaskar Reddy
Author
Hyderabad, First Published Dec 1, 2021, 3:19 PM IST

హైదరాబాద్: అల్వాల్ శ్రీనివాసనగర్ కు చెందిన రియల్టర్ విజయ‌ భాస్కర్ రెడ్డిని హత్య చేసిన నరేందర్ ను హైద్రాబాద్ పోలీసులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు. సోమవారం నాడు రియల్టర్ విజయ భాస్కర్ రెడ్డి హత్యకు గురయ్యాడు.  విజయ భాస్కర్ రెడ్డిని  తుపాకీతో  నరేందర్ కాల్చి చంపినట్టుగా పోలీసులు గుర్తించారు. నరేందర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  రియల్టర్ విజయ భాస్కర్ రెడ్డి హత్యకు సంబంధించి హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్  బుధవారం నాడు మీడియాకు వివరించారు. నిందితుడు నరేందర్ ను పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెట్టారు. విజయ భాస్కర్ రెడ్డి హత్యకు దారి తీసిన కారణాలను సీపీ అంజనీకుమార్ వివరించారు.  

ఇటీవలనే కొనుగోలు చేసిన నాటు Pistolతో విజయ భాస్కర్ రెడ్డిని కారులోనే నిందితుడు నరేందర్ కాల్చి చంపాడని హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. 48 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. నిందితుడిని గుర్తించి, అరెస్ట్ చేసిన పోలీసు అధికారులను సీపీ అభినందించారు.Vijay Bhaskar Reddy తలలో బుల్లెట్ దొరికిందని Anjani kumar తెలిపారు.పోస్టు మార్టం రిపోర్టులో ఈ విషయం వెల్లడైందన్నారు. నిందితుడు Narender ఉపయోగించిన తుపాకీలో ఉపయోగించిన బుల్లెట్ తో  మృతుడి తలలో దొరికిన బుల్లెట్ సరిపోయిందని సీపీ అంజనీకుమార్ వివరించారు. మరో వైపు నిందితుడి  హత్య స్థలంలో కన్పించిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డైనట్టుగా సీపీ వివరించారు. మృతుడు విజయ భాస్కర్ రెడ్డి, నిందితుడు  నరేందర్ కూడా ఒకే ప్రాంతంలో ఉన్నట్టుగా సెల్ ఫోన్ టవర్ లోకేషన్  ఆధారంగా గుర్తించామని హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. విజయ భాస్కర్ రెడ్డి   భార్య ఫిర్యాదుతో వివిధ కోణాల్లో తిరుమలగిరి పోలీసులు దర్యాప్తు చేశారని సీపీ తెలిపారు. భూ వివాదంలో అడ్డు వస్తున్నాడనే నెపం కూడా ఈ హత్యకు కారణంగా ఆయన వివరించారు. విజయ భాస్కర్ రెడ్డికి నిందితుడు నరేందర్ సమీప బంధువు అని సీపీ తెలిపారు. 

also read:రియాల్టర్ విజయభాస్కర్ రెడ్డి హత్య : నాటు తుపాకీ ఎక్కడా? వెలుగులోకి కొత్త కోణాలు...

  విజయ భాస్కర్ రెడ్డి తన ఇంటి నుండి కొద్ది దూరం వెళ్లిన తర్వాత నరేందర్ ఇదే కారులో ఎక్కినట్టుగా సీసీటీవీ దృశ్యాల్లో రికార్డైందన్నారు. తనకు రావాల్సిన కమిషన్ విషయమై విజయ భాస్కర్ రెడ్డితో నరేందర్ గొడవకు దిగినట్టుగా సీపీ తెలిపారు. అయితే విజయ భాస్కర్ రెడ్డిని హత్య చేయాలని పథకం వేసుకొన్న నరేందర్ తన వెంట నాటు తుపాకీని తీసుకొచ్చాడని  అంజనీ కుమార్ తెలిపారు.  కమిషన్ గురించి విజయ భాస్కర్ రెడ్డితో వాగ్వాదానికి దిగిన నరేందర్  తన వెంట తెచ్చుకొన్న తుపాకీతో కాల్చి చంపాడని సీపీ తెలిపారు. దీంతో  విజయ భాస్కర్ రెడ్డి డ్రైవింగ్ సీట్లోనే మరణించాడు.  విజయ భాస్కర్ రెడ్డి చనిపోయాడని నిర్ధారించుకొన్న తర్వాతే నరేందర్  కారు నుండి బయటకు దిగాడు.మధ్య ప్రదేశ్ రాష్ట్రం నుండి నరేందర్ నాటు తుపాకీని కొనుగోటు చేసినట్టుగా తమ దర్యాప్తులో తేలిందని సీపీ తెలిపారు.  మాజీ కౌన్సిలర్ ను హత్య చేసేందుకు కూడా నరేందర్ గతంలో కుట్ర పన్నారని కూడా తమ దర్యాప్తులో తేలిందని సీపీ అంజనీ కుమార్ తెలిపారు.వీరిద్దరూ కలిసి  రియల్ వ్యాపారాలు నిర్వహించారు. అయితే ఈ విషయమై ఆర్ధిక వివాదాలున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ కమిషన్ విషయమై విజయ భాస్కర్ రెడ్డి ఇవ్వకపోవడంతో నరేందర్ ఈ దారుణానికి పాల్పడినట్టుగా పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.  గతంలో మద్దెలచెర్వు సూరిని  భాను హత్య చేసినట్టుగానే  నరేందర్ కూడా విజయ భాస్కర్ రెడ్డిని హత్య చేశాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios