శంషాబాద్ లో దారుణం చోటు చేసకొంది. వాహనలా బ్యాటరీలను దొంగతనం చేశారనే నెపంతో ఇద్దరిని స్థానికులు స్థంబానికి కట్టేసి కొట్టారు. అంతేకాదు వారికి గుండు కొట్టించారు. ఈ ఘటనకు పాల్పడిన ఐదుగురిని శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: వాహనాల బ్యాటరీలు దొంగతనం చేశారనే నెపంతో ఇద్దరు యువకులను స్థంబానికి కట్టేసి గుండు కొట్టించారు స్థానికులు, ఈ ఘటనపై బాధితులు శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. .Shamshabad లోని అహ్మద్ నగర్ లో నివాసం ఉండే ఖుద్దూస్, ఖాజాలు old scrap వ్యాపారం చేస్తుంటారు. అయితే వాహనాల battery లను దొంగతనం చేస్తారని వీరిపై ఆరోపణలున్నాయి. అయితే ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలోని వాహనాల బ్యాటరీలు చోరీకి గురౌతున్నాయి.
దీంతో స్థానికులు ఈ బ్యాటరీల కోసం Khaja ఇంట్లో వెతికితే కొన్ని బ్యాటరీలు లభ్యమయ్యాయి. ఖాజా, khuddus లు బ్యాటరీలను చోరీ చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరిని విద్యుత్ స్థంబానికి కట్టేసి చితకబాదారు. అంతేకాదు మళ్లీ ఈ తరహాలో చోరీలకు పాల్పడకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఇద్దరికి Head shave చేశారు. ఈ దృశ్యాలను సెల్‌ఫోన్లలో రికార్డు చేశారు. ఈ అవమానంపై బాధితులు శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులను అవమానపర్చిన ఘటనలో ఐదుగురిని శంషాబాద్ పోలీసులు Arrest చేశారు.
