ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మాజీ మంత్రి సమీప బంధువు మన్యం కృష్ణ కిషోర్ రెడ్డిని బంజారా హిల్స్‌లో ఓ పబ్‌లో డ్రగ్స్ తీసుకుంటూ ఉండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మన్యం కృష్ణ కిషోర్ రెడ్డితో పాటూ ఇంటర్నేషనల్ డీజీ ఈవెంట్ మేనేజర్ మైరాన్ మోహిత్‌ను అరెస్ట్ చేశారు.
హైదరాబాద్‌లో డ్రగ్స్ కేసులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మాజీ మంత్రి సమీప బంధువు మన్యం కృష్ణ కిషోర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మన్యం కృష్ణ కిషోర్ రెడ్డి బంజారా హిల్స్‌లో ఓ పబ్‌లో డ్రగ్స్ తీసుకుంటూ ఉండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మన్యం కృష్ణ కిషోర్ రెడ్డితో పాటూ ఇంటర్నేషనల్ డీజీ ఈవెంట్ మేనేజర్ మైరాన్ మోహిత్‌ను అరెస్ట్ చేశారు. ఇద్దరి నుంచి పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకన్నారు. కృష్ణ కిషోర్ రెడ్డి ప్రముఖ వ్యాపారిగా ఉన్నారు. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారవేత్తలతో మంచి పరిచయాలు కూడా ఉన్నాయి. వారిలో కొందరికి కృష్ణ కిషోర్ రెడ్డి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే బెంగళూరు నుంచి కృష్ణ కిషోర్ రెడ్డి బస్సుల్లో హైదరాబాద్‌కు డ్రగ్స్ తెప్పిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది.
మరోవైపు న్యూ ఇయర్‌కు సెలబ్రేషన్స్‌కు ముందే మోహిత్ డ్రగ్స్‌తో హైదరాబాద్ చేరుకున్నాడు. మోహిత్ భార్య నేహా దేశ్ పాండే సినీ ఇండస్ట్రీలో ఉన్నారు. ఆమె తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో నటించారు. ఇక, మోహిత్ కాంటాక్ట్స్‌లో ఉన్న వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులకు, బడా బాబుల పిల్లలకు కొకైన్ సరఫరా చేసినట్లు గుర్తించారు. మోహిత్ దగ్గర వంద మంది డీజేలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.
