Asianet News TeluguAsianet News Telugu

గోవా నుండి డ్రగ్స్ సరఫరా: హైద్రాబాద్‌లో రాజేష్ నాయక్ అరెస్ట్


హైద్రాబాద్ లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న రాజేష్ నాయక్ అనే  వ్యక్తిని పోలీసులు అరెస్ట్  చేశారు. న్యూఇయర్ వేడుకల కోసం  ఈ డ్రగ్స్  తీసుకువచ్చినట్టుగా  పోలీసులు అనుమానిస్తున్నారు. 

Hyderabad police arrested drug peddler Rajesh naik from Goa
Author
First Published Dec 19, 2022, 8:53 PM IST

హైదరాబాద్: గోవా నుండి డ్రగ్స్ తీసుకు వచ్చి  హైద్రాబాద్ లో  సరఫరా చేస్తున్న రాజేష్ నాయక్  అనే వ్యక్తిని  పోలీసులు సోమవారం నాడు అరెస్ట్  చేశారు.  నిందితుడి నుండి  46 గ్రాముల ఎండీఎంఏ  ను సీజ్  చేశారు.  న్యూఇయర్ వేడుకల కోసం గోవా నుండి డ్రగ్స్ తీసుకువచ్చినట్టుగా  పోలీసులు అనుమానిస్తున్నారు.  మరో డ్రగ్ పెడ్లర్ ఆపిల్  పారిపోయారు. గతంలో కూడా డ్రగ్స్ గంజాయిని సరఫరా చేస్తున్న వారిని  రెండు తెలుగు రాష్ట్రాలకు  చెందిన పోలీసులు అరెస్టయ్యారు. 

పెళ్లి బృందం ముసుగులో డ్రగ్స్ సరఫరా చేస్తున్న  ముఠాను  హైద్రాబాద్ రాచకొండ పోలీసులు ఈ నెల  12న అరెస్ట్  చేశారు.  చెన్నైకు చెందిన ఇద్దరు  నిందితులు  పెళ్లి బృందం ముసుగులో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని  పోలీసులు ప్రకటించారు.  అదే రోజున మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు  అంతర్జాతీయ  డ్రగ్స్  ముఠాను అరెస్ట్ చేశారు. విదేశాల నుండి డ్రగ్స్ తెచ్చి  హైద్రాబాద్ లో  సరఫరా చేస్తున్నారు.కొరియర్ ద్వారా  డ్రగ్స్  తీసుకువచ్చి  సరఫరా చేస్తున్నారని  పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరిని  పోలీసులు అరెస్ట్  చేశారు.రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్,  నందిగామల్లో  గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న  ముఠాను  పోలీసులు ఈ నెల 1వ తేదీన అరెస్ట్  చేశారు.  నలుగురు ముఠా సభ్యులు గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నట్టుగా  పోలీసులు తెలిపారు.

also read:డ్రగ్స్ కేసుతో సంబంధం ఉందని రుజువు చేస్తే రాజీనామా: బీజేపీ నేతలకు పైలెట్ రోహిత్ రెడ్డి కౌంటర్

గుజరాత్ రాష్ట్రంలో  ఏటీఎస్ అధికారులు  రూ. 500 కోట్ల విలువైన డ్రగ్స్ ను సీజ్ చేశారు. వడోదరలోని ఓ గోడౌన్లో  చట్టవిరుద్దంగా డ్రగ్స్ తయారు చేస్తున్నారని  సమాచారం అందుకున్న  ఏటీఎస్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఏడాది  నవంబర్  30న  ఏటీఎస్ అధికారులు  డ్రగ్స్ తయారు చేస్తున్న ఐదుగురు నిందితులను అరెస్ట్  చేశారు.రాజస్థాన్ నుండి హైద్రాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న  నలుగురిని రాచకొండ పోలీసులు  ఈ ఏడాది నవంబర్  30న అరెస్ట్  చేశారు.  నిందితులు ఎవరెవరికి  డ్రగ్స్  సరఫరా చేశారనే విషయమై పోలీసులు  ఆరా తీశారు.ఈ ఏడాది నవంబర్  27న  ముంబై ఎయిర్ పోర్టులో  రూ. 50 కోట్ల విలువలైన  7.9 కిలోల విలువైన హెరాయిన్ ను  డీఆర్ఐ అదికారులు  సీజ్  చేసుకున్నారు. ఇథియోపియా  నుండి నిందితులు  ఇండియాకు  డ్రగ్స్  సరఫరా చేస్తున్నారని డీఆర్ఐ అధికారులు  గుర్తించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios