Asianet News TeluguAsianet News Telugu

317 జీవో రద్దు కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క దీక్ష: అరెస్ట్ చేసిన పోలీసులు

317 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క హైద్రాబాద్ ట్యాంక్ బండ్  వద్ద దీక్షకు దిగింది. పోలీసులు ఆమె దీక్షను అడ్డుకొన్నారు. సీతక్క సహా పలువురు ఎన్ఎస్‌యూఐ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Hyderabad police arrested Congress MLA Seetakka  at Tank bund
Author
Hyderabad, First Published Jan 12, 2022, 2:38 PM IST


హైదరాబాద్: 317 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ Congress పార్టీ MLAసీతక్క హైద్రాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద దీక్షకు ప్రయత్నించారు. ఈ దీక్షను పోలీసులు అడ్డుకొన్నారు. ఎమ్మెల్యే Seetakka  సహా ఆమెకు మద్దతుగా నిలిచిన ఎన్ఎస్‌యూఐ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. పోలీస్ స్టేషన్ లో కూడా సీతక్కDeeksha కొనసాగిస్తున్నారు.

ఈ సందర్భంగా  ఎమ్మెల్యే సీతక్క  మీడియాతో మాట్లాడారు. అసంబద్ధ బదిలీలతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రభుత్వం నిర్ణయంతో ఇప్పటికే  9 మంది ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చేసుకొన్నారని ఆమె గుర్తు చేశారు. ఉపాధ్యాయులు చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని  సీతక్క మండిపడ్డారు. 317 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయానికి సంబంధించి ఉద్యోగులతో చర్చలు జరపాలన్నారు.

Empoyees, Teachersకీ ఆమోదయోగ్యమైన బదిలీ ప్రక్రియ చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. స్థానికత ఆధారంగా బదిలీలు చేయాలన్నారు. ట్రైబల్ ఉద్యోగులను మైదానాలకు, అక్కడి ఉద్యోగులను అటవీ ప్రాంతాలకు బదిలీ చేయడం వల్ల మానసిక వేదనకు గురవుతున్నారని చెప్పారు. Bjp డ్రామాలు ఆపాలని ఆమె సూచించారు. President Ramnath Kovind చేత ఉత్తర్వులు రద్దు చేయించాలని  ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన 317 జీవో పై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు జిల్లా, జోనల్, మల్టీ జోనల్, స్టేట్ కేడర్లుగా విభజించారు. టీచర్ ఉద్యోగాలను జిల్లాల వారీగా భర్తీ చేస్తారు. గతంలో జిల్లాల విభజనకు పూర్వం టీచర్ ఉద్యోగాలను సర్కార్ భర్తీ చేసింది. తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత  ప్రస్తుతం ఆ ఉద్యోగాలను కొత్త జిల్లాల వారీగా కేటాయిస్తున్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఒకే ఉమ్మడి జిల్లాలోని కొన్ని మండలాలు వేరే ఉమ్మడి జిల్లాల్లోకి వెళ్లాయి. ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగులను జిల్లాల వారీగా కేటాయిస్తున్న సమయంలో సీనియారిటీని ప్రాతిపదికన తీసుకుంది. దీంతో సీనియర్లు అంతా పట్టణ ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. దీంతో గత రెండు నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు సాధించిన జూనియర్లు తప్పనిసరి పరిస్థితుల్లో మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

సీనియర్ టీచర్లకు పట్టణ ప్రాంతాలకు ఎంపిక చేసుకొంటున్నారు. అయితే జూనియర్ టీచర్లు ఆయా జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలను ఎంచుకోవాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొంటున్నాయి. అంతేకాదు సుమారు 25 వేల మంది టీచర్లు తమ స్థానికతను కోల్పోయే ప్రమాదం కూడా ఉందని ఉపాధ్యాయసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.  తమ ప్రాంతం కాకపోయినా.. కొత్త జిల్లాలకు వెళ్లాల్సి వస్తోందని జూనియర్ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

టీచర్ ఉద్యోగాలను జిల్లాల వారీగా ఏర్పడిన ఖాళీల ఆధారంగానే భర్తీ చేస్తూ ఉంటారు. దీంతో ఆ మారుమూల ప్రాంతాల్లో ఇప్పట్లో ఖాళీలు ఏర్పడే అవకాశమే ఉండదని నిరుద్యోగ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. టీచర్ల కేటాయింపునకు ప్రభుత్వం తీసుకువచ్చిన విధానం హేతుబద్ధంగా లేదని ఆయా వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. వీరికి బీజేపీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మద్దతుగా నిలుస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios