అమ్మాయి ప్రొఫైల్ ఫోటోతో పెళ్లికి రెడీ: యూట్యూబ్ చూసి నేరం చేసిన ఆశోక్ హైదరాబాద్ లో అరెస్ట్
హైద్రాబాద్ కు చెందిన ప్రవీణ్ కుమార్ ను ప్రేమ పేరుతో మోసం చేసిన నూజవీడుకి చెందిన ఆశోక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేస్ బుక్ లో అమ్మాయి ప్రొఫైల్ పిక్చర్ పెట్టి మోసం చేసిన ఆశోక్ ను అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: ఆన్‌లైన్ లో యువతి పేరుతో రూ. 45 లక్షలు కొట్టేశాడు ఓ కేటుగాడు. యూట్యూబ్ లో చూసిన క్రైమ్ న్యూస్ స్పూర్తితో నిందితుడు ఈ నేరానికి పాల్పడ్డాడు. యువతిగా ప్రొఫైల్ ను క్రియేట్ చేసి ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశాడు.
Andhra Pradesh రాష్ట్రంలోని Nuzvidకు చెందిన Ashok బీటెక్ చివరి సంవత్సరంలోనే చదువును ఆపేశాడు కొంత కాలం క్రితమే ఆయనకు వివాహమైంది. ఆశోక్ కు భార్య, కుమార్తె ఉన్నారు. ఆశోక్ Youtube చూసే అలవాటు ఉంది. యువతిగా మారి నేరాలు చేసిన ఓ క్రైమ్ న్యూస్ ఆశోక్ ను ఆకర్షించింది.
2020 ఫిబ్రవరిలో Face book లో Indusha Tummala పేరుతో ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. ఈ ప్రొఫైల్ కి ఇంటర్నెట్ నుంచి సేకరించిన యువతి ఫొటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టాడు. ఈ ఖాతా నుంచి అనేక మందికి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపాడు. ఈ ప్రొఫైల్ చూసిన హైద్రాబాద్ నగరానికి చెందిన జూబ్లీహిల్స్ కు చెందిన Praaveen Kumar ఈ ఫ్రెండ్ రిక్వెస్ట్ ను అంగీకరించాడు.
కొన్ని రోజులు ఇందుష మాదిరిగా ప్రవీణ్‌తో చాట్ చేసిన అశోక్ ఆపై ప్రేమ పేరుతో ఎర వేశాడు. వాయిస్ చేంజ్ యాప్‌ను వినియోగించి ప్రవీణ్‌కు కాల్స్ చేసేవాడు.. ఈ యాప్ కారణంగా అశోక్ గొంతు యువతిదిగా మారి ప్రవీణ్‌కు వినిపించేది. కొన్నాళ్లకు అశోక్ అలియాస్ ఇందుష పెళ్లి ప్రస్తావన చేయడంతో ప్రవీణ్ అంగీకరించాడు.
తొలుత కాలేజీ ఫీజు కట్టాలంటూ రూ.3 లక్షలు తన ఖాతాలో వేయించుకున్నాడు. కరోనా మొదటి వేవ్‌లో తల్లికి కోవిడ్ సోకిందని రూ.10 లక్షలు, రెండో వేవ్‌లో తనకూ వచ్చిందంటూ రూ.15 లక్షలు వైద్య ఖర్చుల పేరుతో కాజేశాడు. ఇలా రెండేళ్లలో రకరకాల అవసరాలు చెప్పి రూ.45 లక్షలు ప్రవీణ్ నుంచి గుంజాడు.
తన Online ప్రేమ విషయాన్ని ప్రవీణ్ తన సమీప బంధువుకు చెప్పాడు. ఆన్ లైన్ ప్రేమ విషయంపై అతడికి అనుమానం వచ్చింది. వెంటనే ఇందుషను కలవాలని అడగాలని ప్రవీణ్ కు అతను సూచించాడు.. దీంతో ప్రవీణ్ ఎన్నిసార్లు కోరినా ఇందుషగా చెప్పుకుంటున్న అశోక్ దాటవేశాడు. కానీ అదే సమయంలో డబ్బు అడిగాడు. ఇందుష ఎంతకు కలవలేదు. దీంతో తాను మోసపోయినట్టుగా గుర్తించిన ప్రవీణ్ వెంటనే Cyber Crime పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ జి.వెంకట్రామిరెడ్డి నేతృత్వంలో ఎస్సై కె.మధుసూదన్‌తో కూడిన బృందం దీన్ని దర్యాప్తు చేసింది. అశోక్‌ను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేసింది. రూ.45 లక్షల్లో రూ.43 లక్షలు ఆన్‌లైన్ గేమింగ్‌లో ఖర్చు చేశాడని పోలీసులు గుర్తించారు. మిగిలిన రూ.2 లక్షలతో పాటు నేరానికి వాడిన ఫోన్ రికవరీ చేశారు. Social Media లో గుర్తు తెలియని వారి నుండి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్ లను అంగీకరించవద్దని కూడా పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్నారు. కానీ పోలీసుల హెచ్చరికలు పాటించని వారు మోసపోతూనే ఉన్నారు.