తెలంగాణ పబ్లిక్  సర్వీసెస్  కమిషన్ కు చెందిన  ప్రశ్నాపత్రం లీకేజీలో 13 మందిని  పోలీసులు  అరెస్ట్  చేశారు. ఈ కేసును లోతుగా  దర్యాప్తు  చేస్తున్నారు పోలీసులు.

హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ప్రశ్నాపత్రం లీక్ కేసులో పోలీసులు 13 మందిని అరెస్ట్ చేశారు.ఈ కేసు విచారణలో పోలీసులు కీలక విషయాలను గుర్తించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో టౌన్ ప్లానింగ్ ఓవర్సీస్ పరీక్షలు ఈ నెల 12న జరగాల్సి ఉంది. ఈ నెల 15, 16 తేదీల్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామాకాల విషయమై పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో సెక్రటరీగా పనిచేసే వ్యక్తికి పీఏగా పనిచేసే ప్రవీణ్ ఈ పేపర్ లీక్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఓ యువతి కోసం ప్రవీణ్ ఈ పేపర్ ను లీక్ చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు యువతి తన సోదరుడి కోసం ప్రవీణ్ ను ట్రాప్ చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

ప్రవీణ్ ను హానీ ట్రాప్ చేసిన యువతి సోదరుడి కోసం ఈ పేపర్ లీక్ చేశారని పోలీసులు గుర్తించారు. యువతి ప్రభుత్వ టీచర్ గా పని చేస్తుందని పోలీసులు విచారణలో గుర్తించారు.టీఎస్‌పీఎస్‌సీ లో ఆడ్మిన్ విభాగంలో పనిచేసే రాజశేఖర్ ను ప్రశ్నాపత్రం గురించి ప్రవీణ్ అడిగారు. సెక్షన్ ఆఫీసర్ సిస్టమ్ లో ప్రశ్నాపత్రం ఉంటుందని రాజశేఖర్ ప్రవీణ్ కు సమాచారం ఇచ్చాడు.

ఈ కంప్యూటర్ నుండి ప్రవీణ్ పెన్ డ్రైవ్ లో ప్రశ్నాపత్రాన్ని కాపీ చేసుకున్నాడు. ఈ ప్రశ్నాపత్రాన్ని ప్రింట్ తీసి యువతికి పంపాడు. ఆ యువతి ఈ పేపర్ ను తనకు తెలిసిన మరో యువకుడిపి పంపింది. ఆ యువకుడు మరో ముగ్గురికి షేర్ చేశాడు. ఈ క్రమంలో సుమారు రూ. 14 లక్షలను యువతి వసూలు చేసిందని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ టీవీ 9 కథనం ప్రసారం చేసింది. ఈ రూ. 14 లక్షలను నిందితులుపంచుకుున్నారని ఈ కథనం తెలిపింది.

టీఎస్‌పీఎస్‌సీకి చెందిన కంప్యూటర్లు హ్యాక్ అయినట్టుగా తొలుత ప్రచారం సాగింది. అయితే టీఎస్‌పీఎస్‌సీ కంప్యూటర్లు హ్యాక్ కాలేదని అధికారులు గుర్తించారు. పేపర్ లీకైనట్టుగా పోలీసులు గుర్తించారు. ఓ యువతి కోసం ప్రవీణ్ ఈ పేపర్ ను లీక్ చేసినట్టుగా గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

also read:టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్‌లో ట్విస్ట్ : హానీట్రాప్ ను గుర్తించిన పోలీసులు

గతంలో కూడా ఇదే తరహలో పేపర్ లీకేజీలు జరిగాయా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్ కావడంతో పరీక్షలను వాయిదా వేశారు. టౌన్ ప్లానింగ్ ఓవర్సీస్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల పరీక్షల నిర్వహణకు సంబంధించిన తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు.