హైదరాబాద్‌లోని సనత్ నగర్‌లో 8 ఏళ్ల బాలుడు అబ్దుల్ వహీద్ హత్య కేసులో పురోగతి లభించింది. బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.

హైదరాబాద్‌లోని సనత్ నగర్‌లో 8 ఏళ్ల బాలుడు అబ్దుల్ వహీద్ హత్య కేసులో పురోగతి లభించింది. బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. హిజ్రాతో పాటు ఆటో డ్రైవర్ రఫీక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనలో నరబలి కోణాన్ని పోలీసులు ఖండించారు. అయితే బాలుడి తండ్రి, నిందితుల మధ్య ఆర్థిక వివాదమే హత్యకు కారణమని పోలీసులు గుర్తించారు. 

ఇదిలా ఉంటే.. అల్లావుదీన్ కోటిలో నివాసం ఉంటున్న అబ్దుల్‌ వహీద్‌ గురువారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికిన తల్లిదండ్రులు సనత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కొన్ని గంటల తర్వాత బకెట్‌లో కుక్కి ఉన్న బాలుడి మృతదేహాన్ని జింకలవాడ నాలాలో స్థానికులు గుర్తించారు. దీంతో అక్కడికిచేరుకున్న పోలీసులు మృతదేహాన్ని నాలా నుంచి వెలికితీశారు. అయితే ఈ కేసులో సీసీటీవీ కెమెరాలు పోలీసులు సాయం చేశాయి. 

‘‘గురువారం రాత్రి 9 గంటలకు బాలుడి మిస్సింగ్ ఫిర్యాదు అందింది. గురువారం. సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించిన తర్వాత సాయంత్రం 5.30 గంటల సమయంలో బాలుడిని హిజ్రా ఇమ్రాన్ ఇంటికి పిలిపించారని మేము కనుగొన్నాము. బాలుడు బయటకు వస్తున్నట్లు కెమెరాల్లో కనిపించలేదు. హిజ్రాను విచారణ కోసం పిలిచాం. ఆ సమయంలో అతను బాలుడిని చంపినట్లు ఒప్పుకున్నాడు. మృతదేహాన్ని పడేసిని చోటును గుర్తించాం’’ అని చెప్పారు. 

బాలుడు మృతదేహాన్ని బ్యాగ్‌లో చుట్టి బకెట్‌లో అమర్చేందుకు చేతులు, కాళ్లు విరగొట్టారని.. ఆ తర్వాత మూసాపేట వరకు ఆటోరిక్షాలో తీసుకెళ్లినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే హిజ్రా ఇమ్రాన్‌తో పాటు, ఆటో డ్రైవర్ రఫీక్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.