Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్‌లోని ఓ ఇంట్లో పేలుడు.. వృద్దురాలికి తీవ్ర గాయాలు..

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ఓ ఇంట్లో శుక్రవారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. పేలుడు దాటికి ఆ ఇంట్లో ఉన్న ఓ వృద్దురాలికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. కూకట్‌పల్లి వెంకట్రావునగర్‌లోని ఇంట్లో కంప్రెసర్‌ గ్యాస్‌ లీకై పేలుడు సంభవించింది. 

Hyderabad old Woman Critically injured after blast in home at kukatpally
Author
Hyderabad, First Published Jan 14, 2022, 4:14 PM IST

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ఓ ఇంట్లో శుక్రవారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. పేలుడు దాటికి ఆ ఇంట్లో ఉన్న ఓ వృద్దురాలికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. కూకట్‌పల్లి వెంకట్రావునగర్‌లోని ఇంట్లో కంప్రెసర్‌ గ్యాస్‌ లీకై పేలుడు సంభవించింది. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ పేలుడు తీవ్రతకు ఇంటి తలుపులు, కిటికీలు, ఇతర సామాగ్రి ధ్వంసం అయ్యాయి. ఇంట్లో ఉన్న వృద్దురాలు తీవ్రంగా గాయపడటంతో ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్లను అడిగి వివరాలు సేకరిస్తున్నారు. పేలుడు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇక, హైదరాబాద్‌లోని షేట్ బషీరాబాద్‌లో గత నెలలో చోటచేసున్న పేలుడులో ఇద్దరికి తీవ్ర గాయాలు అయిన సంగతి తెలిపిందే. షేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్‌లో ఓ ప్లాస్టిక్ స్క్రాప్ గౌడౌన్ ఉంది. ఇందులో ప్లాస్టిక్ స్క్రాప్ ను రీసైకిల్ చేస్తారు. రోజులాగానే.. ప్లాస్టిక్ స్క్రాప్ చిన్న చిన్న‌ ముక్కలు చేస్తున్నారు.  ఈ క్రమంలోనే కెమిక‌ల్ డబ్బా మూత తీస్తుండ‌గా.. ఒక్క‌సారిగా భారీ పేలుడు జ‌రిగింది.ఈ ఘ‌ట‌న‌లో ఇద్దరికి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌తో స్థానికులు భ‌యాందోళ‌నకు గుర‌య్యారు.

Follow Us:
Download App:
  • android
  • ios