Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ యువ‌త‌కు విదేశాల్లో మ‌రిన్ని ఉపాధి అవ‌కాశాలు.. సీఎస్ ప్ర‌త్యేక స‌మావేశం

Employment: విద్యార్థులకు ప్రాథమిక పాఠ్యాంశాలతో పాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ఇంగ్లిష్‌లో బోధించేందుకు కోర్సులతో పాటు రిసోర్స్‌ పర్సన్‌లను గుర్తించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను వినియోగించుకోవడంతోపాటు బలోపేతం చేయాలని సూచించారు.
 

Hyderabad : More employment opportunities for Telangana youth abroad.. CS special meeting
Author
First Published Oct 28, 2022, 11:09 AM IST

Hyderabad: తెలంగాణ యువతకు విదేశాల్లో మరిన్ని ఉద్యోగాలు కల్పించడంపై అధికారులతో రాష్ట్ర సీఎస్ సమావేశమయ్యారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కార్పొరేషన్ బలోపేతానికి పీఎంయూ/సలహా మండలిని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని సీఎస్ నొక్కి చెప్పారు.

వివ‌రాల్లోకెళ్తే.. రాష్ట్రంలోని యువతకు విదేశాల్లో మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఐఏఎస్‌లు గురువారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర యువ‌త‌కు శిక్షణ, సామర్థ్యాన్ని పెంపొందించడం, విదేశీ దేశాలలో ఉద్యోగ అవ‌కాశాలు, సంబంధిత‌ మార్కెట్‌ను మెరుగుపరచడం వంటి వాటిపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని చీఫ్ సెక్రటరీ నొక్కిచెప్పారు.

తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కార్పొరేషన్ (టామ్‌కామ్)ను బలోపేతం చేసేందుకు పీఎంయూ/సలహా మండలిని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని సీఎస్ నొక్కి చెప్పారు. విదేశాల్లో ఎక్కువ మంది నర్సింగ్ విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా వ్యూహాన్ని రూపొందించాలని ఆరోగ్య శాఖ అధికారులను కోరారు. ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలల్లో నర్సింగ్‌ కోర్సు చదువుతున్న విద్యార్థులందరికీ మోటివేషనల్‌ క్యాంపులు నిర్వహించి విదేశాల్లో ఉద్యోగావకాశాల గురించి వివరించాలని ఆదేశించారు. అదేవిధంగా ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న టెక్నికల్ కోర్సులను షార్ట్‌లిస్ట్ చేయాలని సూచించారు. 

విద్యార్థులకు ప్రాథమిక పాఠ్యాంశాలతో పాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ఇంగ్లిష్‌లో బోధించేందుకు కోర్సులతో పాటు రిసోర్స్‌ పర్సన్‌లను గుర్తించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను వినియోగించుకోవడంతోపాటు బలోపేతం చేయాలని ఆయ‌న అన్నారు. 

స్పెషల్ చీఫ్ సెక్రటరీ, LET&F రాణి కుముదిని, ప్రిన్సిపల్ సెక్రటరీ, IT&C జయేష్ రంజన్, కాలేజ్ & టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్, సెక్రటరీ HM&FW SAM రిజ్వీ, సెక్రటరీ PR&RD సందీప్ కుమార్ సుల్తానియా, OSD సీఎం డాక్టర్ గంగాధర్, కమిషనర్, లేబర్ అహ్మద్ నదీమ్ పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, డీఎంఈ రమేష్‌రెడ్డి, డైరెక్టర్‌ నిమ్స్‌ మనోహర్‌, సీఈవో, టాస్క్‌ శ్రీకాంత్‌ సిన్హా, ఇతర అధికారులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios