అమెరికాలో హైదరాబాదులోని సైదాబాద్ కు చెందిన టెక్కీ అదృశ్యం వెనక గల అసలు విషయం వెలుగు చూసింది.

హైదరాబాద్: అమెరికాలో హైదరాబాదులోని సైదాబాద్ కు చెందిన టెక్కీ అదృశ్యం వెనక గల అసలు విషయం వెలుగు చూసింది. అమెరికాలో ఉంటున్న తన కుమారుడు రాఘవేంద్ర గత 9 నెలలుగా కనిపించడం లేదంటూ హైదరాబాదులోని తండ్రి పి. బంగారం ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ఓ మహిళను కొట్టినందుకు అతను జైలు పాలయ్యాడు. దాంతో అతను డిప్రెషన్ లోకి వెళ్లాడు. ఈ విషయాన్ని రాఘవేంద్ర తన ఇంటికి ఫోన్ చేసి స్వయంగా చెప్పాడు. కాలిఫోర్నియాలో అతను మహిళను కొట్టాడు.

తన కుమారుడి అదృశ్యంపై టెక్కీ పాండు రాఘవేంద్ర రావు తండ్రి పి. బంగారం హైదరాబాదులోని సైదాబాదు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశాడు. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ కు కూడా విజ్ఞప్తి చేశాడు.

తన కుమారుడు తనకు ఫోన్ చేసి విషయం చెప్పాడని రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయిన బంగారం చెప్పాడు. సైదాబాదు పోలీసు స్టేషన్ లో చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకున్నట్లు తెలిపాడు.