Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ మెట్రో దసరా ఆఫర్స్.. ఛార్జీల్లో 40 శాతం రాయితీ

దసరా పండుగ సందర్భంగా ప్రయాణికులకు రాయితీలు ప్రకటించింది హైదరాబాద్ మెట్రో. ఇందుకు సంబంధించిన వివరాలను మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి మీడియాకు వెల్లడించారు. మెట్రో సువర్ణ ఆఫర్‌ కింద ప్రయాణ ఛార్జీల్లో 40 శాతం రాయితీ కల్పిస్తున్నట్టు ఆయన తెలిపారు. 

hyderabad metro offers for dussehra ksp
Author
Hyderabad, First Published Oct 16, 2020, 5:31 PM IST

దసరా పండుగ సందర్భంగా ప్రయాణికులకు రాయితీలు ప్రకటించింది హైదరాబాద్ మెట్రో. ఇందుకు సంబంధించిన వివరాలను మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి మీడియాకు వెల్లడించారు.

మెట్రో సువర్ణ ఆఫర్‌ కింద ప్రయాణ ఛార్జీల్లో 40 శాతం రాయితీ కల్పిస్తున్నట్టు ఆయన తెలిపారు. రేపటి నుంచి అక్టోబర్ చివరి వరకు ఛార్జీల్లో రాయితీ వర్తిస్తుందని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు.

వరదల వల్ల నగరంలో రోడ్లు దెబ్బతినడంతో ప్రయాణం కష్టంగా మారిందని.. ఈ క్రమంలోనే మెట్రోలో ప్రయాణాలకు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాయితీలు ప్రకటించినట్లు వివరించారు. నగరంలో భారీ స్థాయిలో వరద ఉన్న రోజున ఒక గర్భిణి కోసం ప్రత్యేకంగా ఒక మెట్రో రైలును నడిపినట్లు చెప్పారు.  

రాయితీల వివరాలు... 

  •  స్మార్ట్‌ కార్డు ద్వారా 14 ట్రిప్పుల ఛార్జీతో 30 రోజుల్లో 20 ట్రిప్పులు తిరిగే అవకాశం.
  •  20 ట్రిప్పుల ఛార్జీలతో 45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం.
  •  40 ట్రిప్పుల ఛార్జీతో 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరిగే  అవకాశం.    

 టీ సవారీ మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా నవంబరు 1 నుంచి..   

  •  7 ట్రిప్పులకు ఛార్జీ  చెల్లిస్తే .. 30 రోజుల్లో 10 ట్రిప్పులు తిరిగే అవకాశం.
  • 14 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే ..45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం.
  •  20 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే ... 45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం.  
  • 30 ట్రిప్పులకు ఛార్జీ  చెల్లిస్తే ... 45 రోజుల్లో 45  ట్రిప్పులు తిరిగే అవకాశం.  

>  40 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే ... 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరిగే అవకాశం కల్పించినట్లు ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. మెట్రో ప్రయాణికులను ప్రోత్సహించేందుకే ఈ రాయితీలు కల్పిస్తున్నట్టు వెల్లడించారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios