టెక్నికల్ ఇష్యూ రావడంతో హైదరాబాద్ మెట్రో గురువారం రాత్రి ఆగిపోయింది. మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో వెళ్లే రైలు అసెంబ్లీ స్టేష‌న్లో నిలిచిపోయింది. ఇలా 20 నిమిషాల పాటు ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. 

నిత్యం హుషారుగా ప‌రుగులు పెడుతూ ప్ర‌యాణికుల‌ను వారి గ‌మ్య స్థానాల‌కు చేరుస్తోంది హైద‌రాబాద్ మెట్రో. మెట్రో అందుబాటులోకి వ‌చ్చాక హైద‌రాబాద్ (hyderabad) ట్రాఫిక్ (traffic)లో ప్ర‌జ‌లు ప‌డే అవస్థ‌లు కొంత మేర‌కు త‌గ్గాయి. లోకల్ బ‌స్సుల్లో, బైక్, కారు తీసుకొని ఈ ట్రాఫిక్ లో తిప్ప‌లు ప‌డుతూ తిరిగే కంటే ఎక్కువ మంది మెట్రో లోనే ప్ర‌యాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. బ‌స్సుతో పోలిస్తే ఛార్జీలు కొంత మేర ఎక్కువే అయిన‌ప్ప‌టికీ తొంద‌ర‌గా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ‌మ్య స్థానానికి చేరుతామ‌నే ఉద్దేశంతో ఎంతో మంది హైద‌రాబాద్ మెట్రోనే ఆశ్ర‌యిస్తున్నారు. వెంట వెంట‌నే స‌ర్వీసులు అందుబాటులో ఉండ‌టం, సౌక‌ర్య‌వంత‌మైన ప్ర‌యాణాన్ని క‌ల్పించ‌డం మెట్రో ప్ర‌త్యేక‌త‌. 

హైద‌రాబాద్ ప‌ట్ట‌ణవాసుల ఆద‌ర‌ణ పొందుతున్న మెట్రో గురువారం రాత్రి మోరాయించింది. ఎక్క‌డా విరామం లేకుండా చ‌క చ‌క వెళ్లే హైద‌రాబాద్ మెట్రో ఒక్క సారిగా ఆగిపోయింది. టెక్నికల్ ఇష్యూ (technical issue) తలెత్త‌డంతో మియాపూర్-ఎల్బీనగర్ (miyapur lb nagar) మార్గంలో వెళ్లే రైలు అసెంబ్లీ స్టేష‌న్ (assembly station) లో నిలిచిపోయింది. ఇలా దాదాపు 20 నిమిషాల కంటే ఎక్కువ‌గానే మెట్రో ఆగిపోయింది. దీంతో ప్ర‌యాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. త‌రువాత స‌మ‌స్య ప‌రిష్కారం కావ‌డంతో మ‌ళ్లీ పరుగులు తీసింది. 

ఇదిలా ఉండగా.. ప్రయాణికుల ఆరోగ్యం కోసం దేశంలోనే మొదటి సారిగా మెట్రో లో ఓజోన్‌ (ozone) ఆధారిత శానిటైజేషన్‌ (sanitization) ను ఏర్పాటు చేశారు. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఎంతో మంది ఇబ్బంది ప‌డ్డారు. చాలా మంది త‌మ ఆత్మీయుల‌ను కోల్పొయారు. కరోనా (corona) సోకి తమ ప్రయాణికులు ఎవ‌రూ ఇబ్బంది ప‌డొద్దు అనే ఉద్దేశంతో హైద‌రాబ్ మెట్రో రైల్ అధికారులు ఈ కొత్త శానిటైజేష‌న్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. కోచ్ ల‌ను శానిటైజ్ చేసేందుకు ఈ కొత్త విధానం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. క‌రోనా వైర‌స్ వ్యాపించ‌కుండా నియంత్రించ‌డానికి ఈ ఓజోన్ ఆధారిత శానిటైజేష‌న్ ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉండ‌నుంది. 

2020 లాక్ డౌన్ (lock down) స‌మ‌యంలో హైద‌రాబాద్ మెట్రో ను చాలా రోజుల పాటు నిలిపివేశారు. దీంతో చాలా మంది ప్ర‌యాణికులు ఇబ్బంది ప‌డ్డారు. మెట్రో కు వ‌చ్చే ఆదాయం కూడా భారీగా ప‌డిపోయింది. విడుత‌ల వారీగా లాక్ డౌన్ ఎత్తేసిన స‌మ‌యంలో హైద‌రాబాద్ మెట్రో తిరిగి ప్రారంభ‌మైంది. మొద‌ట్లో మెట్రోలో ప్ర‌యాణించేందుకు ప్రయాణికులు ఆలోచించినప్ప‌టికీ సిబ్బంది తీసుకుంటున్న జాగ్ర‌త్తల వ‌ల్ల మెట్రోకు మ‌ళ్లీ పూర్వ వైభవం వ‌చ్చింది. క‌రోనా విజృంభ‌న మొద‌లైన్ప‌టి నుంచే మెట్రో కోచ్ ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు శానిటైజేష‌న్ చేస్తున్నారు. అలాగే మెట్రోలో ప్ర‌యాణించేందుకు వ‌చ్చే ప్రయాణికుల‌కు స్టేష‌న్ లోనే టెంప‌రేచ‌ర్ (temperature) చెక్ చేస్తున్నారు. దీంతో పాటు స్టేష‌న్ ల‌లో శానిటైజర్లు అందుబాటులో ఉంచుతున్నారు. మెట్రో ప్రయాణంలో మాస్కు త‌ప్ప‌నిస‌రి చేశారు. ఈ విష‌యాన్ని స్టేష‌న్ల‌లో ప‌దే ప‌దే అనౌన్స్ చేస్తున్నారు. ఇలా అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నియంత్ర‌ణ చ‌ర్య‌లు చేప‌డుతూ మెట్రో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది.