ఆన్‌లైన్ లో బిర్యానీ ఆర్డర్: చనిపోయిన బల్లి, సోషల్ మీడియాలో ఆడేసుకున్న నెటిజన్లు

హైద్రాబాద్ బిర్యానీని ఆర్డర్ చేసిన వినియోగదారుడు షాక్ కు గురయ్యాడు.  ఆన్ లైన్ లో  వచ్చిన చికెన్ బిర్యానీలో  బల్లి  రావడంతో  అతను సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేశారు.  ఈ విషయమై  నెటిజన్లు మండిపడుతున్నారు.

Hyderabad Man Orders Biryani, Finds Dead Lizard In It. Video Goes Viral lns

హైదరాబాద్: బిర్యానీని లొట్టలేసుకొంటూ  తినాలని భావించిన ఓ కుటుంబానికి నిరాశే ఎదురైంది.   ఆన్ లైన్ లో బిర్యానీ ఆర్డర్ చేస్తే  చికెన్ బిర్యానీలో  చనిపోయిన బల్లి కన్పించింది. దీంతో  బిర్యానీ ఆర్డర్ చేసిన వినియోగదారుడు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేశారు. 

హైద్రాబాద్ అంబర్ పేట ప్రాంతానికి చెందిన  విశ్వ ఆదిత్య అనే వ్యక్తి  సోషల్ మీడియా వేదికగా  బిర్యానీలో చనిపోయిన బల్లి ఉన్న వీడియోను షేర్ చేశాడు. ఈ  వీడియో  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిమిషం నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

చికెన్ బిర్యానీ కోసం ఆన్ లైన్ లో  విశ్వ ఆదిత్య ఆర్డర్ చేశాడు. అయితే  ఈ బిర్యానీలో బల్లిని గుర్తించారు. తాను ఆర్డర్ చేసిన  సంస్థ ప్రతినిధితో కూడ  విశ్వ ఆదిత్య  ఈ విషయమై ఫిర్యాదు చేశాడు. ఈ స్క్రీన్ షాట్లను కూడ  సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. హైద్రాబాద్ నగరంలోని  ప్రముఖ హోటల్ నుండి ఈ బిర్యానీ వచ్చినట్టుగా అతను షేర్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు  హోటల్ పై మండిపడ్డారు.

ప్రసిద్ద రెస్టారెంట్లు నాణ్యతను విస్మరిస్తున్నాయని  నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయమై  కొందరు నెటిజన్లు మీమ్ లు కూడ పెట్టారు.  రెస్టారెంట్ తీరును తప్పుబడుతున్నారు.  ఈ ట్వీట్ పై జోమాటో స్పందించింది.తాము సమస్యను గుర్తించినట్టుగా తెలిపింది.  వినియోగదారుడితో మాట్లాడినట్టుగా ఆ సంస్థ ప్రకటించింది.ఈ విషయాన్ని తాము సీరియస్ గా తీసుకున్నట్టుగా జోమాటో సంస్థ ప్రకటించింది.తదుపరి చర్యలకు తాము కృషి చేస్తున్నామని తెలిపింది.

గత ఏడాది మే మాసంలో కూడ  ఇదే రకమైన ఫిర్యాదు స్థానికంగా ఉన్న రెస్టారెంట్ పై వచ్చాయి. ఈ విషయమై  బీజేపీ కార్పోరేటర్  ఫిర్యాదు చేశారు.మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు రెస్టారెంట్ పై దాడి చేశారు.

 

హైద్రాబాద్ లో విశ్వ ఆదిత్య అనే వ్యక్తి చికెన్ బిర్యానీ కోసం  ఆర్డర్ చేశాడు. చికెన్ బిర్యానీలో  చనిపోయిన బల్లి రావడంతో  అతను ఫిర్యాదు చేశాడు.ఈ వీడియోను విశ్వ ఆదిత్య సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నెటిజన్లు ఈ విషయమై  మండిపడుతున్నారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios