లోన్ యాప్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. రుణాలు తీసుకున్నవారిని తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు. తాజాగా లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు మరో వ్యక్తి బలి అయ్యాడు.
లోన్ యాప్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. రుణాలు తీసుకున్నవారిని తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు. తాజాగా లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు మరో వ్యక్తి బలి అయ్యాడు. వివరాలు.. హైదరాబాద్‌లోని జియాగూడకు చెందిన రాజ్‌కుమార్ ఆన్‌లైన్ లోన్ యాప్‌లో రూ. 12 వేలు అప్పు తీసుకున్నాడు. అయితే లోన్ సమయంలో రిఫరెన్స్‌గా స్నేహితుల ఫోన్ నెంబర్లను ఇచ్చాడు. తీసుకున్న రుణానికి సంబంధించి.. ఈఎంఐ ద్వారా 4 నెలలు చెల్లింపులు చేశాడు.
మిగిలిన నగదు చెల్లించకపోవడంతో రాజ్‌కుమార్ స్నేహితులకు లోన్ యాప్ నిర్వాహకులు మెసేజ్‌లు చేశారు. ఈ విషయం తెలుసుకున్న రాజ్ కుమార్ తీవ్ర మనస్థాపం చెందాడు. ఈ క్రమంలోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇక, అవసరం నిమిత్తం లోన్ యాప్ ద్వారా రుణాలు తీసుకుంటున్న కొందరు.. వాటిని సకాలంలో చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఆన్‌లైన్ లోన్ యాప్ నిర్వాహకులు.. రికవరీ విషయంలో తీవ్రమైన వేధింపుకు గురిచేస్తున్నారు. దీంతో యాప్‌ల ద్వారా లోన్ తీసుకున్న పలువురు తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
