Asianet News TeluguAsianet News Telugu

పదికూడా పాస్ కాలేదు.. 20మంది సాఫ్ట్ వేర్ అమ్మాయిలకు వల

కనీసం పదో తరగతి కూడా పాస్ కాని ఓ వ్యక్తి.. బాగా చదువుకొని జీవితంలో స్థిరపడి..ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలలో పనిచేస్తున్న దాదాపు 20మంది అమ్మాయిలను మోసం చేశాడు. 

Hyderabad: Man dupes 20 women with offer of marriage
Author
Hyderabad, First Published Nov 15, 2018, 11:57 AM IST


కనీసం పదో తరగతి కూడా పాస్ కాని ఓ వ్యక్తి.. బాగా చదువుకొని జీవితంలో స్థిరపడి..ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలలో పనిచేస్తున్న దాదాపు 20మంది అమ్మాయిలను మోసం చేశాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  సికింద్రాబాద్ కి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని...ఈ ఏడాది ఫిబ్రవరిలో జీవన్ షాదీ.కామ్ అనే మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో తన వివరాలను పొందుపరిచింది. అందులో రిషి కుమార్ నేలపాటి అనే వ్యక్తి ఆమెకు ఇంట్రస్ట్ గా అనిపించడంతో.. అతనితో పరిచయం పెంచుకుంది.

కొద్దిరోజులు ఫోన్లో మాట్లాడుకున్న అనంతరం ఇరువురు వారి ఫోటోలను ఒకరికి మరొకరు పంపించుకున్నారు. రోజూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవారు. సదరు వ్యక్తి తాను బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో పనిచేస్తున్నానని యువతిని నమ్మించాడు. ఒకరోజు యువతికి ఫోన్ చేసి తన తల్లి ఆరోగ్యం బాగాలేదని డబ్బులు అవసరమని చెప్పాడు.

ఆమె వెంటనే తన క్రెడిట్ కార్డ్ డీటైల్స్, ఓటీపీ నెంబర్ అన్నీ అతనికి పంపింది. ఆమె వద్ద నుంచి దాదాపు రూ.2.4లక్షల వరకు కాజేశాడు. డబ్బు తీసుకున్న తర్వాత కలుద్దామని యువతి అడిగిన నాటి నుంచి ఆమెను బ్లాక్ చేసేసాడు. ఫోన్ చేయడం,. మెసేజ్ లకు రిప్లై ఇవ్వడం మానేశాడు. దీంతో మోసపోయానని గుర్తించిన యువతి పోలీసులను ఆశ్రయించింది.

ఆమె ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన సైబరాబాద్ క్రైమ్ పోలీసులకు.. అతను ఒక చీటర్ అని తెలిసింది. అతను నెల్లూరుకి చెందిన జీవన్ కుమార్ గా గుర్తించారు. అతను 8వ తగరతి వరకే చదువుకున్నాడని.. చిన్నప్పుడు గోవాలో ఉండేవారని తెలిసింది. ఆర్థిక సమస్యలు తలెత్తండంతో నెల్లూరు వచ్చి స్థిరపడ్డాడు.

నిత్యం కంప్యూటర్ ముందు కూర్చొని సాఫ్ట్ వేర్ అమ్మాయిలకు వల వేసి.. వారి నుంచి డబ్బు గుంజుతాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇప్పటి వరకు 20మంది అమ్మాయలను మోసం చేశాడు. జీవన్ కి చదువు లేకపోయినా.. ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం మాత్రం బాగా ఉంది. వాటితోనే అమ్మాయిలను సులభంగా బురిడీ కొట్టించాడు.

బెంగళూరుకి చెందిన ఓ అమ్మాయి వద్ద ఏకంగా రూ.10లక్షలు కాజేసినట్లు తెలిసింది. కేవలం తెలుగు రాష్ట్రాలే కాకుండా వివిధ రాష్ట్రాల అమ్మాయిలను ఇలా మోసం చేశాడు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios