హైదరాబాద్: హైద్రాబాద్ కు చెందిన ఓ వ్యక్తి సిరియాలో మృతి చెందాడు. ఐసీస్‌లో చేరి ప్రాణాలను ఆయన పోగొట్టుకొన్నాడు. భార్యతో కలిసి వెళ్లిన ఆ ఇంజనీర్ మృతి చెందాడు.హైద్రాబాద్ కు తనను తీసుకెళ్లాలని మృతుడి భార్య హైద్రాబాద్ లోని బంధువులను కోరింది.

 విధులు నిర్వహించేందుకు హైద్రాబాద్ కు చెందిన ఓ ఇంజనీర్ సిరియాకు వెళ్లాడు. కొంతకాలానికి ఆయన తన భార్యా పిల్లలను కూడ హైద్రాబాద్ నుండి సిరియాకు తీసుకెళ్లాడు. సిరియాలో విధులు నిర్వహిస్తూ ఆయన అక్కడే ఐసీస్ కార్యక్రమాలకు ఆకర్షితుడై ఐసీస్ లో చేరాడు. 

ఐసీస్ లో పనిచేస్తున్న సమయంలోనే ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో ఆ వ్యక్తి 2018 నవంబర్ మాసంలో మృతి చెందాడు. అతను మృతి చెందడంతో ఆయన భార్యాపిల్లలు  అక్కడే ఓ శిబిరంలో తలదాచుకొంటున్నారు.

అయితే తమను హైద్రాబాద్ తీసుకెళ్లాలని  మృతుడి భార్య తమ బంధువులను ఫోన్ లో కోరింది. సౌదీ అరేబియా, టర్కీ మీదుగా సిరియాకు ఆ ఇంజనీర్ వెళ్లినట్టుగా సమాచారం.సిరియాలోని ఉగ్రవాద శిబిరంలో శిక్షణ  తీసుకొన్నాడు.

 సిరియాకు వెళ్లే సమయంలో ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు. సిరియాలో ఆ దంపతులకు మరో ఇద్దరు పిల్లలు పుట్టారు.హైద్రాబాద్‌లోని టోలి చౌకీ కి చెందిన వారుగా తెలుస్తోంది.