ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ప్రేమను పవిత్రమైన పెళ్లి బంధంగా మార్చుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండాల్సిన ఆ దంపతుల కాపురంలో కలతలు వచ్చి చేరాయి. కొద్దిరోజులు సజావుగా కాపురం చేసిన భార్య పుట్టింటికి వెళ్లి కాపురానికి ససేమిరా అంది. భర్త ఎంత బ్రతిమిలాడినా రానని తెగేసి చెప్పడంతో మనస్థాపం చెందిన ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
హైదరాబాద్ : ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ప్రేమను పవిత్రమైన పెళ్లి బంధంగా మార్చుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండాల్సిన ఆ దంపతుల కాపురంలో కలతలు వచ్చి చేరాయి. కొద్దిరోజులు సజావుగా కాపురం చేసిన భార్య పుట్టింటికి వెళ్లి కాపురానికి ససేమిరా అంది. భర్త ఎంత బ్రతిమిలాడినా రానని తెగేసి చెప్పడంతో మనస్థాపం చెందిన ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన హైదరాబాద నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే నేరేడ్మెట్ పి.బి కాలనీకి చెందిన నవీన్ (24), అదే కాలనీకి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఈ ఏడాది మార్చిలో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. మెుదట్లో ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరి జీవితంలో కలతలు చెలరేగాయి. యువతి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు.
కలిసి ఉందాం రమ్మంటూ నవీన్ అతని భార్యను ఎన్నోసార్లు బ్రతిమిలాడాడు. కాపురానికి రావాలంటూ ప్రాధేయపడ్డాడు. అయినా ఆమె కాపురానికి వచ్చేది లేదని తెగేసి చెప్పింది. భార్య ఎన్నిసార్లు చెప్పినా కాపురానికి రానని చెప్పడంతో నవీన్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. తన భార్య కాపురానికి రాకుండా పుట్టింటి వద్దే ఉంటుందని తల్లితో చెప్పి బాధపడ్డాడు. ఆ తర్వాత తన గదిలోకి వెళ్లి నిద్రపోయాడు.
ఉదయం ఎంతసేపటికీ తలుపు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి చూడగా నవీన్ ఉరివేసుకుని కనిపించాడు. విగతజీవిగా వేలాడుతున్న కొడుకుని చూసి ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. తన కొడుకు మృతికి కోడలే కారణమంటూ నేరేడ్మెట్ పోలీసులకు ఫిర్రయాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
