Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు లోక్‌సభ నియోజకవర్గాలు విస్తరించి వున్నాయి. వీటిలో హైదరాబాద్ ఒకటి. పాతబస్తీ మొత్తం దీని కిందకు వస్తాయి. ఈ నియోజకవర్గం మొత్తం ముస్లింల ప్రాబల్యం అధికం. అందులోనూ ఎంఐఎం పార్టీకి హైదరాబాద్ కంచుకోట . ఇక్కడ ఆదిలో కాంగ్రెస్ ఆధిపత్యం సాగినప్పటికీ.. తర్వాత ఎంఐఎం పార్టీ హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలో తిరుగులేని శక్తిగా అవతరించింది. దశాబ్థాలుగా బీజేపీ హిందుత్వ ఎజెండాతో హేమాహేమీలను రంగంలోకి దింపి ఒవైసీ కంచుకోటను బద్ధలు కొట్టేందుకు ప్రయత్నిస్తూనే వుంది. సుల్తాన్ సలావుద్దీన్ 1984 నుంచి 1999 వరకు ఆరు సార్లు  హైదరాబాద్ ఎంపీగా గెలిచారు. ఆయన తర్వాత సలావుద్దీన్  కుమారుడు అసదుద్దీన్ ఒవైసీ 2004 నుంచి 2019 వరకు వరుసగా నాలుగు సార్లు గెలిచారు. 1984 నుంచి నేటి వరకు హైదరాబాద్‌లో మరో పార్టీకి స్థానం లేదంటే ఎంఐఎం పట్టును అర్ధం చేసుకోవచ్చు. 
 

hyderabad Lok Sabha elections result 2024 ksp
Author
First Published Mar 14, 2024, 5:37 PM IST

హైదరాబాద్.. ఈ పేరు వినగానే 400 ఏళ్ల ఘన చరిత్ర, చార్మినార్, గోల్కొండ కోట, సైబర్ టవర్స్, ట్యాంక్ బండ్, సాలర్ జంగ్ మ్యూజియం, హుస్సేన్ సాగర్ అందులోని బుద్ధ విగ్రహం , రామోజీ ఫిల్మ్ సిటీ , ముత్యాలు, బిర్యానీ కళ్లెదుట కదులుతాయి. ఎందరో రాజులు, చక్రవర్తులు, సుల్తాన్‌లు పరిపాలించిన ఈ నగరం నాటి చరిత్రకు సజీవ సాక్ష్యం. ఆధునిక కాలంలోనూ హైటెక్ సిటీగా భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటిగా వెలుగొందుతోంది. ఎన్నో రాజవంశాలకు రాజధానిగా విలసిల్లిన హైదరాబాద్.. ఉమ్మడి ఏపీకి, ప్రస్తుత తెలంగాణకు కూడా రాజధానిగా సేవలందిస్తోంది. దీంతో సహజంగానే రాజకీయాలకు, పరిపాలనకు కేంద్రం. భిన్నత్వంలో ఏకత్వానికి , దేశంలోని భిన్న సంస్కృతులకు హైదరాబాద్ కేంద్రం. 

హైదరాబాద్ ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. తొలుత కాంగ్రెస్, తర్వాత మజ్లిస్ :

రాజకీయాల విషయానికి వస్తే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు లోక్‌సభ నియోజకవర్గాలు విస్తరించి వున్నాయి. వీటిలో హైదరాబాద్ ఒకటి. పాతబస్తీ మొత్తం దీని కిందకు వస్తాయి. ఈ నియోజకవర్గం మొత్తం ముస్లింల ప్రాబల్యం అధికం. అందులోనూ ఎంఐఎం పార్టీకి హైదరాబాద్ కంచుకోట. ఇక్కడ మేనిఫెస్టోలు, ఇతరత్రా ప్రచార అంశాలు ప్రభావం చూపవు. ముస్లిం, హిందుత్వ ఎజెండాలే ముఖ్యం. ఇక్కడ ఆదిలో కాంగ్రెస్ ఆధిపత్యం సాగినప్పటికీ.. తర్వాత ఎంఐఎం పార్టీ హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలో తిరుగులేని శక్తిగా అవతరించింది. దశాబ్థాలుగా బీజేపీ హిందుత్వ ఎజెండాతో హేమాహేమీలను రంగంలోకి దింపి ఒవైసీ కంచుకోటను బద్ధలు కొట్టేందుకు ప్రయత్నిస్తూనే వుంది. 

హైదరాబాద్ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024 .. కాంగ్రెస్‌ ఆరుసార్లు విక్టరీ :

1952లో నియోజకవర్గం ఏర్పడిన తొలినాళ్లలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ పీపుల్స్ డెమొక్రాటిక్ ఫ్రంట్ నేతలకు ప్రజల మద్ధతు వున్నప్పటికీ.. స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీగా, నిజాం పాలనను అంతం చేసిన పార్టీగా వున్న కాంగ్రెస్ ముందు నిలవలేకపోయింది. ఆ తర్వాత ఎంఐఎం ఇక్కడ పాగా వేసింది.

హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ ఆరు సార్లు విజయం సాధించగా.. ఎంఐఎం 9 సార్లు గెలిచింది. సుల్తాన్ సలావుద్దీన్ 1984 నుంచి 1999 వరకు ఆరు సార్లు  హైదరాబాద్ ఎంపీగా గెలిచారు. ఆయన తర్వాత సలావుద్దీన్  కుమారుడు అసదుద్దీన్ ఒవైసీ 2004 నుంచి 2019 వరకు వరుసగా నాలుగు సార్లు గెలిచారు. 1984 నుంచి నేటి వరకు హైదరాబాద్‌లో మరో పార్టీకి స్థానం లేదంటే ఎంఐఎం పట్టును అర్ధం చేసుకోవచ్చు. 

హైదరాబాద్ ఎంపీ (పార్లమెంట్) ఎన్నికల ఫలితాలు 2024 .. 40 ఏళ్లుగా ఎంఐఎం కంచుకోట :

హైదరాబాద్‌లో బీజేపీకి సైతం బలమైన ఓటు బ్యాంక్ వుంది. ఎంఐఎంకు చెక్ పెట్టేందుకు బీజేపీ పెద్దలు ప్రత్యేక దృష్టి సారించారు. 2009 మినహా 1999 నుంచి నేటి వరకు బీజేపీ అభ్యర్ధులు ఈ స్థానంలో రెండో స్థానంలో నిలుస్తూ వస్తున్నారు. మాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ అగ్రనేత వెంకయ్య నాయుడు సైతం ఇక్కడ పోటీ చేసినప్పటికీ సుల్తాన్ సలావుద్దీన్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత బద్ధం బాల్‌రెడ్డి ఎంఐఎంకు ముచ్చెమటలు పట్టించారు. 

హైదరాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో మలక్‌పేట, కార్వాన్, గోషామహాల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్ పురా, బహదూర్ పురా అసెంబ్లీ స్థానాలున్నాయి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఏడు స్థానాల్లో ఆరు చోట్ల ఎంఐఎం గెలవగా.. ఒకచోట బీజేపీ విజయం సాధించింది. హైదరాబాద్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 19,57,931 మంది. వీరిలో పురుషులు 9,45,277 మంది.. మహిళా ఓటర్లు 10,12,522 మంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్ధి అసదుద్ధీన్ ఒవైసీకి 5,17,471 ఓట్లు.. బీజేపీ అభ్యర్ధి భగవంత్ రావుకు 2,35,285 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్ధి పీ శ్రీకాంత్‌కు 63,239 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా ఒవైసీ 2,82,186 ఓట్ల మెజారిటీతో హైదరాబాద్‌ను నాలుగోసారి కైవసం చేసుకున్నారు. 

హైదరాబాద్ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024 .. ఈసారి ఒవైసీకి సెగ తప్పదా : 

ఒకప్పటి తన కంచుకోటలో తిరిగి పాగా వేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దీనిలో భాగంగా ఆర్ధికంగా బలవంతుడైన మస్కతీ డైరీ అధినేత అలీ మస్కతీ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులు పుష్కళంగా వున్నాయి. మస్కతీ.. పాతబస్తీలో విస్తృతంగా ప్రచారం చేస్తూ దూసుకెళ్తున్నారు. అయితే మస్కతీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఒవైసీ. రేవంత్ అండ చూసుకుని రెచ్చిపోతే.. మీ ప్రొడక్ట్స్ నాశనమైపోతాయని హెచ్చరించారు. బీజేపీ విషయానికి వస్తే.. విరించి హాస్పిటల్స్ ఛైర్మన్ మాధవీ లతను అభ్యర్ధిగా ఖరారు చేసింది. హిందుత్వ ఎజెండాతో పాటు ఆర్ధికంగా బలమైన వ్యక్తి కావడంతో ఎంఐఎంకు పోటీ తప్పదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. బీఆర్ఎస్ తన మిత్రపక్షం ఎంఐఎం విషయంలో చూసీచూడనట్లుగా వుంటుందో లేక బలమైన అభ్యర్ధిని దించుతుందో తెలియాల్సి వుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios