మీకు ఏ సీఎం ఇష్టం: విద్యార్ధులు, ఆసక్తికర సమాధానమిచ్చిన గవర్నర్

Hyderabad Little flower school studenst intresting question to Governor Narasimhan
Highlights

మీకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి ఇష్టమని  ఓ విద్యార్ధి ఉభయ రాష్ట్రాల గవర్నర్  నరసింహన్‌ను ప్రశ్నించారు.ఆ విద్యార్ధి ప్రశ్నకు గవర్నర్‌ కూడ చాలా తెలివిగా సమాధానమిచ్చారు. 
 


హైదరాబాద్: మీకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి ఇష్టమని  ఓ విద్యార్ధి ఉభయ రాష్ట్రాల గవర్నర్  నరసింహన్‌ను ప్రశ్నించారు.ఆ విద్యార్ధి ప్రశ్నకు గవర్నర్‌ కూడ చాలా తెలివిగా సమాధానమిచ్చారు. 

బుధవారం నాడు  ఉభయరాష్ట్రాల గవర్నర్ నరసింహాన్  ఆబిడ్స్‌లోని  లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లో  విద్యార్ధులతో ముఖాముఖిలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా విద్యార్ధులు గవర్నర్‌ నరసింహాన్ ను పలు ప్రశ్నలు వేశారు.

ఇందులో భాగంగా ఓ విద్యార్ధి రెండు తెలుగురాష్ట్రాల్లో  ఏ సీఎంను అమితంగా ఇష్టపడుతారో చెప్పాల్సిందిగా కోరారు.  రెండు రాష్ట్రాలు తనకు రెండు కళ్లలాంటివని గవర్నర్ నరసింహాన్ చెప్పారు. రెండు కళ్లలో ఏది ఇష్టమంటే  చెప్పలేనని గవర్నర్ చెప్పారు. 

జీవితంలో చదువే ముఖ్యమన్నారు.  బాగా చదువుకొంటే తాము అనుకొన్న లక్ష్యాలను సాధించవచ్చాన్నారు.  కనిపెంచిన తల్లిదండ్రులను, విద్య నేర్పిన గురువులను  తాము చదువుకొన్న స్కూల్ ను  ఏనాటికి కూడ మర్చిపోకూడదని ఆయన సూచించారు. 

తాను కూడ 5వతరగతి వరకు ఇదే స్కూల్‌లో చదువుకొన్నట్టు ఆయన చెప్పారు. తాను చదువుకొన్న స్కూల్ కు  గవర్నర్ హోదాలో రావడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు.  పట్టుదలతో చదివి తాను ఐపీఎస్ అయ్యాయని ఆయన గుర్తు చేసుకొన్నారు. పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించే అవకాశం ఉందన్నారు. 

loader