Asianet News TeluguAsianet News Telugu

సంక్రాంతికి వందకోట్లు తాగేశారు.. హైదరాబాద్ లో ఇదే ఫస్ట్ టైం...

 హైదరాబాదులో రూ. 25 కోట్లకు పైగా లిక్కర్ అమ్ముడయ్యింది. మేడ్చల్ జిల్లాలో రూ. 20 కోట్ల మేర అమ్మకాలు జరిగినట్లు అంచనా. సాధారణంగా దసరా, డిసెంబర్ 31 సందర్భంగా మద్యం అమ్మకాలు భారీగా పెరుగుతాయి. సంక్రాంతి సందర్భంగా వరుస సెలవులు రావడంతో మద్యం ప్రియులు ఇలా పండగ చేసుకున్నారు.

hyderabad liquor woth rs 100 crore sales sankranthi
Author
Hyderabad, First Published Jan 18, 2022, 1:17 PM IST

హైదరాబాద్ :  sankranthi సందర్భంగా greater లో liquor sales పెరిగాయి. మూడు రోజుల్లో రూ. వంద కోట్లకు పైగా విక్రయాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. సాధారణ రోజుల్లో కంటే అమ్మకాలు పెరిగాయి. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా రూ. 55 కోట్ల మేరకు మద్యం అమ్మకాలు జరగ్గా హైదరాబాదులో రూ. 25 కోట్లకు పైగా లిక్కర్ అమ్ముడయ్యింది. మేడ్చల్ జిల్లాలో రూ. 20 కోట్ల మేర అమ్మకాలు జరిగినట్లు అంచనా. సాధారణంగా దసరా, డిసెంబర్ 31 సందర్భంగా మద్యం అమ్మకాలు భారీగా పెరుగుతాయి. సంక్రాంతి సందర్భంగా వరుస సెలవులు రావడంతో మద్యం ప్రియులు ఇలా పండగ చేసుకున్నారు.

ఇదిలా ఉండగా, డిసెంబర్ 31.. ఏడాది చివరి రోజు 2021 సంవత్సరానికిగాను ముగింపు రోజు... ప్రతి ఏడాది డిసెంబర్ 31 అంటే  కచ్చితంగా పార్టీ చేసుకోవాల్సిందే. పార్టీ అంటే మందు ఉండాల్సిందే. యేటా అందుకే మద్యం అమ్మకాల్లో జోరు కనిపిస్తుంది. డిసెంబర్ 31న కూడా అదే జోరు కనిపించింది.

కరోనా ఆంక్షల కారణంగా మద్యం అమ్మకాలకు కొంత సమయం వరకే అనుమతి ఇచ్చినా.. తర్వాత దానిని పొడిగించారు. దీంతో డిసెంబర్ 31 ఏ బార్లో చూసిన మందుబాబుల హడావుడి కనిపించింది. బార్ అండ్ రెస్టారెంట్లు కలకలలాడాయి. ఏడాది మొత్తం రోజుల్లో ఏరోజు జరగని సేల్స్ డిసెంబర్ 31 నాడు జరిగాయి. డిసెంబర్ 31 ఒక్కరోజే రూ.171 కోట్ల మందు అమ్ముడుపోయిందని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.

ఐదు నెలల్లో తొమ్మిది వందల రెండు కోట్లు…
ఈ ఏడాది జరిగిన మద్యం అమ్మకాల వివరాలను ఎక్సైజ్ శాఖ విడుదల చేసింది. మొత్తం ఏడాదిలో జరిగిన అమ్మకాల కంటే గడిచిన ఐదు నెలల్లోనే ఎక్కువగా అమ్మకాలు జరిగాయి అని తెలిపింది. గడిచిన అన్ని నెలల్లో కంటే డిసెంబర్లోనే 3,435 కోట్ల లిక్కర్ సేల్ జరిగిందని పేర్కొంది. గతేడాది చివరి నెలలో 2,764 కోట్ల సేలింగ్ జరిగింది. గత ఏడాది మొత్తం 25,602 కోట్ల మందు అమ్ముడుపోయి ఉందని తెలంగాణ ఎక్సైజ్ శాఖ తెలిపింది. 

అయితే ఏడాది డిసెంబర్ 31 నాటికి కలుపుకొని 30,196 కోట్ల విలువైన మందు అమ్ముడుపోయింది. అయితే ఈ అమ్మకాలు కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో అధికంగా ఉంది.

ఈ ఏడాది తెలంగాణలో వైన్స్ సంఖ్య పెరిగింది. కొత్త మండలాల్లోనూ ఈ సారి వైన్స్ ఓపెన్ చేయడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది.  2016 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు చేసింది.  రెండేళ్లకు ఒకసారి ప్రభుత్వం మద్యం పాలసీ ని తీసుకు వస్తుంది. అయితే కొత్తగా వచ్చిన మద్యం పాలసీ ప్రకారం ప్రతి మండలానికి ఒక వైన్స్ ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. అందులో భాగంగా కొత్తగా ఏర్పాటైన మండలాల్లోనూ వైన్స్ ఓపెన్ చేయడానికి అనుమతి ఇచ్చింది.  

దీంతో నవంబర్లో వైన్స్ లకు టెండర్లు పిలిచింది. అదే నెల చివర్లో లక్కీ డ్రాలో వైన్స్ సొంతం చేసుకున్న వారికి డిసెంబర్ ఒకటో తేదీ నుంచి మద్యం అమ్ముకోవచ్చని అనుమతి ఇచ్చింది. ఇలా కొత్తగా వైన్స్ కు అనుమతి ఇవ్వడం వల్ల అమ్మకాలు పెరిగాయి అని అధికారులు భావిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios