Weather Update: హైదరాబాద్‌లో రాబోయే రెండు రోజుల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై.. తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది.  

Weather Update:  వేస‌వి కాలం ప్రారంభంలోనే మాడు పగిలేలా ఎండలు మండిపోతున్నాయి. బయటకు వెళ్లాలంటే.. భానుడి భగభగలు భయపెడుతున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో కాస్త ఊర‌ట నిచ్చే వార్త చెప్పింది భారత వాతావరణ శాఖ‌. రాబోయే రెండు రోజుల్లో తెలంగాణ‌లో ప‌లు చోట్ల రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవ‌కాశ‌ముందంటూ వాతావరణ శాఖ తెలిపింది. ప్ర‌ధానంగా హైదరాబాద్‌లో శుక్ర‌, శనివారాల్లో ఆకాశం మేఘావృత‌మయ్యే అవ‌కాశ‌ముంద‌నీ, తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌ని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. 

వాతావ‌ర‌ణ శాఖ ప్ర‌కారం.. హైదరాబాద్‌లో రాబోయే కొద్ది రోజుల పాటు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందనీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే రెండు రోజుల్లో హైదరాబాద్‌లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 38 డిగ్రీల సెల్సియస్, 25 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవ‌కాశం ఉందని ఐఎండీ తెలిపింది.

తేలికపాటి వర్షపాతం 

రాబోయే రెండు రోజుల్లో.. నగరంలో ఆకాశం మేఘావృతమై ఉండ‌వ‌చ్చ‌ని హైదరాబాద్‌లోని ఐఎండీ తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో శుక్రవారం ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

గరిష్టంగా..38 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 25 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) అంచనా ప్రకారం.. GHMCలోని అన్ని సర్కిళ్లలో గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్ నుంచి 38 డిగ్రీల సెల్సియస్ మధ్య డోలనం అవుతుందని తెలిపింది.

వేస‌వికాలం ప్రారంభంలోనే న‌గరంలో ఉష్ణోగ్ర‌తలు గ‌రిష్టంగా న‌మోద‌వుతున్నాయి. గ‌త కొన్ని రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. బయటకొస్తే చాలు.. సూర్యుడి భగభగలతో.. న‌గ‌ర‌వాసులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలకు ఆందోళనకు గురయ్యారు. ఇలాంటి తరుణంలో వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డ‌టం.. న‌గ‌ర‌వాసుల‌కు ఊర‌ట నిచ్చే అంశ‌మే. 

రెండు రోజుల క్రితం.. తెలంగాణ హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాలలో చెదురుమదురు వర్షాలు కురిశాయి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లోని అమీర్‌పేటలో అత్యధికంగా 1.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప‌లు ప్రాంతాల్లోనూ వాన‌లు ప‌డ్డాయి. మరికొన్ని ప్రాంతాలలో ఆకాశం మేఘావృతం అయ్యింది. వాతావరణం ఒక్కసారిగా కూల్ అవడంతో ప్రజలకు ఉక్కపోత నుంచి ఉపశమనం లభించినట్లయ్యింది.