Asianet News TeluguAsianet News Telugu

రైతులను వ్యవసాయ కూలీలుగా చేసేందుకు కేసీఆర్ కుట్ర.. : రేవంత్ రెడ్డి

Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో రైతులను వ్యవసాయ కూలీలుగా చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు (కేసీఆర్) కుట్ర పన్నుతున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంభించి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు.

Hyderabad : KCR is conspiring to make farmers agricultural labourers. : Revanth Reddy
Author
First Published Dec 6, 2022, 5:52 AM IST

Telangana PCC President A Revanth Reddy: వికారాబాద్‌ కలెక్టరేట్‌ వద్ద రైతుల నిరసన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏ రేవంత్ రెడ్డి .. రైతుబీమా గురించి కేసీఆర్‌ గొప్పలు చెబుతుంటే పంటల బీమా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం పంట నష్టానికి బీమా ఎందుకు కల్పించడం లేదు. ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం గత 8 ఏళ్లలో 8000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయ‌న తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులను వ్యవసాయ కూలీలుగా చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు (కేసీఆర్) కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. 

సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలు అవలంభించి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ప్రజాసమస్యలను పక్కదారి పట్టించేందుకు టీఆర్‌ఎస్, బీజేపీలు కుట్రలు చేసి రాష్ట్రంలో వివాదాలకు తెరలేపాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ సమాజం అంతా గమనిస్తోందనీ, ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారం, ఢిల్లీ మద్యం కుంభకోణం పేరుతో టీఆర్‌ఎస్‌, బీజేపీ పెద్ద డ్రామాలు ఆడుతున్నాయని రేవంత్‌ అన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ తీహార్‌ జైలులో పెట్టాలని ఆయ‌న‌ డిమాండ్‌ చేశారు.

‘‘2015లో అక్రమంగా జైలుకెళ్లి.. కూతురి పెళ్లి వేడుకకు కూడా వెళ్లనివ్వలేదు.. ఇప్పుడు కేసీఆర్ కూతురి ఇంటికి సీబీఐ వచ్చింది.. కేసీఆర్ పాపం అంత తేలికగా పోదు.. సీబీఐ మీ ఇంటికి వస్తే ఆ బాధ మీకే తెలుస్తుంది" అని అన్నారు. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య నీటి వివాదాల పరిష్కారంలో కేసీఆర్ చిత్తశుద్ధి ఏంటని రేవంత్ ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ వంటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవడంతో రంగారెడ్డి జిల్లాకు సాగునీరు అందకుండా పోయిందన్నారు. నీటి ఎద్దడి నివారణకు గోదావరి నీటిని మెదక్ జిల్లాకు తరలించే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

 

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని రేవంత్ పునరుద్ఘాటించారు. 2 లక్షల వరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.

"గుండెలు పిండేసే విషాదం...ఒకవైపు డాడీ… డాడీ అని పసిబిడ్డల రోదన… మరో వైపు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని భరించలేక సెల్ టవర్ పై ఉరికొయ్యకు వేలాడిన రైతు. 
రైతును కాపాడేందుకు సమయం ఉన్నా స్పందించని యంత్రాంగం. కేసీఆర్ పాలనలో మొద్దుబారి… బండరాయిగా మారిన వ్యవస్థల దుర్మార్గానికి నిదర్శనం ఇది" అంటూ కామారెడ్డి సెల్ టవర్ ఎక్కి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై రేవంత్ రెడ్డి స్పందించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios