Asianet News TeluguAsianet News Telugu

ఆ విషయంలో హైదరాబాద్ దేశంలో నెంబర్ వన్... ప్రపంచంలో 16 స్థానం: అంజనీ కుమార్

రెండు వందల దేశాలలోని ముఖ్య పట్టణాలలో సిసి కెమెరాల గురించి జరిపిన సర్వేలో హైదరాబాద్ 16వ స్థానంలో నిలిచిందని సిపి అంజనీ కుమార్ వెల్లడించారు. 

Hyderabad is 16th most surveilled city in world, first place in india: CP Anjani Kumar
Author
Hyderabad, First Published Jul 25, 2020, 10:25 PM IST

హైదరాబాద్: ముఖ్య నగరాల్లో సిసి కెమెరాల ఏర్పాటు విషయంలో అంతర్జాతీయ స్థాయిలో జరిపిన సర్వేలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ అత్యుత్తమ స్థానంలో నిలిచిందని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. రెండు వందల దేశాలలోని ముఖ్య పట్టణాలలో సిసి కెమెరాల గురించి జరిపిన ఈ సర్వేలో హైదరాబాద్ 16వ స్థానంలో నిలిచిందన్నారు. మన దేశం విషయానికి వస్తే హైదరాబాదే నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని సిపి వెల్లడించారు.

''గత 5 సంవత్సరాల నుండి హైదరాబాదే కాకుండా ప్రపంచంలో అన్ని దేశాలలో ముఖ్యమైన పట్టణాలు న్యూయార్క్, వాషింగ్టన్, టోక్యో, లండన్, ఢిల్లీ, బెంగళూరు అన్ని సిటీస్ లో సేఫ్టీ, సెక్యూరిటీ, టెక్నాలజీ విషయంలో రేస్ జరుగుతుంది. ఈ రేసులో హైదరాబాద్ సిటీ దేశంలోనే నెంబర్ 1గా వచ్చింది. ఇది నాకు చాలా సంతోషం కలిగించింది'' అని అంజనీ కుమార్ పేర్కొన్నారు. 

''ఈ సీసీ కెమెరాలకు సంబంధించిన ఏర్పాట్లు గత ఐదు సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. 2014 సంవత్సరంలో తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చింది.  ముఖ్యమంత్రి తన మొదటి స్పీచ్ లోనే ఫస్ట్ ప్రియటి లా అండ్ ఆర్డర్ కు ఇచ్చారు. ఇప్పటి డిజిపి మహేందర్ రెడ్డి హైదరాబాద్ కమిషనర్ ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ ను ప్రారంభించారు. గత రెండు సంవత్సరాల నుండి నేను సైతం ప్రోగ్రాం కింద రెండు లక్షల సీసీ కెమెరాలను ప్రజల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది'' అని వివరించారు. 

''సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంవల్ల ప్రతి ఒక్కరిలో కూడా సెక్యూరిటీగా ఉన్నామనే భావన ఏర్పడుతుంది. ఈ సిసి కెమెరాల ఏర్పాటులో పూర్తి క్రెడిట్ ను పబ్లిక్ కు ఇస్తున్నాను. గత రెండు మూడు నెలల నుంచి నేను సైతం ప్రోగ్రాం కరోనావైరస్ కారణంగా కొద్దిగా డౌన్ అయింది'' అని తెలిపారు. 

''ఇంటర్నేషనల్ సర్వే లో ప్రపంచంలోనే హైదరాబాద్ కు 16 స్థానం వచ్చింది. నెక్స్ట్ సర్వేలో హైదరాబాద్ టాప్ టెన్ లో వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం హైదరాబాద్ లో 3 లక్షల 70 వేల సిసిటివి కెమెరాలు ఉన్నాయి.హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్ పరిధిలో 10 లక్షల సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా టార్గెట్ పెట్టుకున్నాం. హైదరాబాద్ లోనే ప్రతి సంవత్సరం క్రైమ్ రేట్ తగ్గుతూ వస్తుంది.దానికి ముఖ్య కారణం సీసీటీవీ కెమెరాలే'' అని సిపి అంజనీ కుమార్ వెల్లడించారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios