మేడ్చల్: మేడ్చల్ లో మైనర్ బాలిక హత్య కేసును పోలీసులు చేధించారు. తండ్రే కూతురిపై అత్యాచారం చేసి అత్యంత దారుణంగా హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు సుబ్రమణ్యం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

తూఫ్రాన్ కు చెందిన సుబ్రమణ్యంకు ముగ్గురు పిల్లలు.  ఆయన భార్య మృతి చెందింది.అయితే  సుబ్రమణ్యం మరో మహిళతో సహజీవనం చేస్తున్నారు. ఈ విషయమై సుబ్రమణ్యాన్ని కూతురు నిలదీసింది. ఈ బాలికతో తాను మహిళతో సహ జీవనం చేయడం సాధ్యం కాదని భావించారు.

దీంతో తన కూతురిపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డారని స్థానికులు  ఆరోపిస్తున్నారు. మైనర్ బాలిక ముఖం చెక్కేసింది. కండ్లు పీకేశారు. అత్యంత దారుణంగా ఆ బాలికను హత్య చేశారు. 

మైనర్ బాలిక మృతదేహం శనివారం సాయంత్రం వెలుగు చూసింది. ఈ బాలిక మృతదేహన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మైనర్ బాలికను అత్యంత దారుణంగా  హత్య చేసిన నిందితుడిని శిక్షించాలని  స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.