హైదరాబాద్ నగరంలో మరో కొత్త ముఠా కలకలం రేపుతోంది. అప్పుడే పుట్టిన చిన్నారులను గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్న ముఠాను పోలీసులు గుట్టు రట్టు చేశారు. వీరు ఒక్కో చిన్నారికి రూ.10లక్షల నుంచి రూ.14లక్షల వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.  ఆ ధర విని పోలీసులు కూడా విస్తుపోయారు. 

Also Read చిచ్చర పిడుగు..నడిరోడ్డుపై మేనమమామకు చుక్కలు చూపించి..

ఈ ముఘాకు పలు సంతాన్య సాఫల్య కేంద్రాలు సహరిస్తున్నట్లు తెలుస్తోంది. పిల్లలు లేనివారే లక్ష్యంగా ఈ దందాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. పిల్లలను అమ్మే తల్లులకు మాత్రం రూ.70వేలు మాత్రమే ఇస్తున్నట్లు సమాచారం. ఈ ముఠాలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన 9మందిని పోలీసులు గుర్తించారు. వీరు ఇప్పటి వ రకు 14మంది చిన్నారులను అమ్మేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే శిశువు విక్రయాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు.