Asianet News TeluguAsianet News Telugu

రికార్డులు బ్రేక్.. హైదరాబాద్‌లో రూ. కోటి 26 లక్షల ధర పలికిన గణపతి లడ్డూ.. ఎక్కడంటే.. (వీడియో)

హైదరాబాద్ నగరంలో గణనాథుడి లడ్డూల వేలం ప్రక్రియ కూడా జోరుగా సాగుతుంది. ఆది దేవుడైన గణపతి ప్రసాదాన్ని సొంతం చేసుకోవడానికి భక్తులు పోటీపడుతున్నారు.

Hyderabad Ganesh laddu fetches a record above Rs 1 26 crore in Richmond Villas in Bandlaguda ksm
Author
First Published Sep 28, 2023, 9:28 AM IST

హైదరాబాద్‌ నగరంలో గణేష్ నిమజ్జనం వైభంగా కొనసాగుతుంది. మరోవైపు గణనాథుడి లడ్డూల వేలం ప్రక్రియ కూడా జోరుగా సాగుతుంది. ఆది దేవుడైన గణపతి ప్రసాదాన్ని సొంతం చేసుకోవడానికి భక్తులు పోటీపడుతున్నారు. ఇందుకోసం ఎంతైనా వెచ్చించడానికి వెనకాడటం లేదు. తాజాగా హైదరాబాద్ బండ్లగూడ పరిధిలోని రిచ్మండ్‌ విల్లాలో గణపతి లడ్డూ రికార్డు స్థాయి ధర పలికింది. గతంలో ఎన్నడూ లేని విధంగా.. గణపతి లడ్డూ రూ. కోటి 20 లక్షలు పలికింది. గతంలో కూడా ఇక్కడ గణపతి లడ్డూ రికార్డు ధర పలికిన సంగతి తెలిసిందే. గతేడాది ఇక్కడ గణపతి లడ్డూ రూ. 60.80 లక్షలు పలికింది. అయితే ఈసారి మాత్రం అంతకు రెండింతలు ధర పలకడం గమనార్హం. 2021లో కూడా ఇక్కడ గణపతి లడ్డూ రూ. 41 లక్షలు పలికింది. 

ఇదిలా ఉంటే, మాదాపూర్‌లోని మైహోమ్ భుజాలో కూడా గణపతి లడ్డూ వేలంలో భారీ ధర పలికింది. మైహోమ్‌ భుజాలోని గణేశుని లడ్డూని రూ. 25.50 లక్షలు పలికింది. చిరంజీవి గౌడ్‌ అనే వ్యక్తి  వేలంలో గణపతి ప్రసాదాన్ని దక్కించుకున్నారు. ఈసారి గతేడాది కంటే రూ. 7 లక్షలు అధికంగా ధర పలికింది. 2022లో ఇక్కడ గణపతి లడ్డూ వేలంలో రూ.18.50 లక్షలు పలికిన విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios