తాగిన మైకంలో ఓ మహిళ కుక్కను గొడ్డలితో నరికి అతి దారుణంగా చంపేసింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని నాగోల్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...  నాగోల్ లోని ఓ కమ్యూనిటీ అపార్ట్ మెంట్ కి చెందిన కొందరు కొన్ని సంవత్సరాలుగా ఓ కుక్కను పెంచుకుంటున్నారు. ఆ కుక్క ఎప్పుడూ అదే అపార్ట్ మెంట్ లో ఉంటూ... కాపలాగా ఉండేది.

కాగా... ఇటీవల అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ విపరీతంగా తాగింది. ఆ తాగిన మైకంలో  చేతితో గొడ్డలి పట్టుకొని... కుక్కను అతి కిరాతకంగా నరికేసింది. తీవ్రగాయాలైన కుక్క అక్కడికక్కడే కన్నుమూసింది. కాగా... గతంలో కూడా ఈ మహిళ కొన్ని కుక్కలను  చంపేసిందని స్థానికులు చెబుతున్నారు.  ఆ కుక్క 13 సంవత్సరాలుగా తమతోపాటే ఉంటుందని.. దానిని ఆమె అలా చంపడం తమనందరినీ షాకింగ్ కి గురిచేసిందని స్థానికులు  చెబుతున్నారు. 

కుక్కలపై దాడి చేసినట్లే రేపు చిన్నపిల్లలపై ఆ మహిళ దాడి చేస్తే పరిస్థితి ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఆమె పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆమె దాడి చేసిన వెంటనే కుక్కను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా... అక్కడ చికిత్స అందిస్తుండగానే అది చనిపోయింది. కుక్క లోపలి భాగాలు పూర్తిగా దెబ్బతిన్నాయని డాక్టర్లు చెప్పారు.