శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు. సూడాన్ దేశానికి చెందిన ఓ మహిళ అక్రమంగా బంగారం తరలించేందుకు ప్రయత్నించింది. ఆమె వద్ద 233.2 గ్రాముల అక్రమ బంగారం ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు చెప్పారు. సదరు మహిళ దుబాయ్ నుంచి హైదరాబాద్ కి వచ్చింది. సదరు మహిళ బంగారాన్ని వివిధ రకాల ఆభరణాల రూపంలో తయారు చేయించుకొని తీసుకువచ్చింది.

Also Read రెండు సంవత్సరాల ప్రేమ... పెళ్లైన ఎనిమిది నెలలకే...

ఆ బంగారాన్ని సదరు మహిళ తన లోదుస్తుల్లో దాచి ఉంచి తీసుకురావడం గమనార్హం. ఈ బంగారం విలువ రూ.11లక్షలకు పైగానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. బంగారాన్ని స్వాధీనం చేసుకొని మహిళను అదుపులోకి తీసుకున్నారు.