అతను ఓ డాక్టర్... రోగులకు సర్జరీలు, ఆపరేషన్లు చేసే సమయంలో ఎనస్తీషియా ఇస్తూ ఉంటాడు. అలాంటి డాక్టర్.. తనకు తానే విషాన్ని ఇంజెక్ట్ చేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన  హయత్ నగర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోల్ కి చెందిన రమేష్(36)... అక్కడ ఓ ప్రైవేటు హాస్పిటల్ లో ఎనస్థీషియా నిపుణుడిగా పనిచేస్తున్నాడు. రెండు నెలల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేసిన రమేష్.. తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్ నగరానికి వచ్చాడు. అక్కడ తన పేరెంట్స్ తో కలిసి హయత్ నగర్ లోని లెక్చరర్స్ కాలనీలో ఉంటున్నాడు.

రమేష్ కి 2013లో పెళ్లి జరగగా.. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. కాగా... కొంత కాలంగా భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. భార్య కూడా డాక్టరే కావడం గమనార్హం. కొడుకు కూడా భార్య వద్దే ఉంటున్నాడు.

AlsoRead రెబెల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు కి తీవ్ర అస్వస్థత...

కాగా... భార్యతో విడిపోయిన నాటి నుంచి రమేష్ మానసికంగా చాలా డిస్టర్బ్ అయ్యాడు. రెండు రోజుల క్రితం రమేష్... తాను పై అంతస్థులో పడుకుంటానని తల్లిదండ్రులకు చెప్పాడు. తర్వాత కిందకు రాలేదు. బయటకు ఎక్కడికైనా వెళ్లి ఉంటాడని వారు భావించారు. తీరా అనుమానం వచ్చి పైకి వెళ్లి చూస్తే.. రూఫ్ మీద చనిపోయి ఉన్నాడు. 

అతని పక్కనే పాయిజన్, సూదీ ఉన్నాయి. దీంతో వాటితోనే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. భార్య దూరం అయ్యిందన్న బాధతోనే అతను ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.