కేంద్ర మాజీ మంత్రి, నటుడు కృష్ణంరాజు (79) అస్వస్థతకు గురయ్యారు. కొంతకాలంగా తీవ్రమైన నిమోనియాతో బాధపడుతున్న ఆయన బుధవారం రాత్రి తవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. దీంతో.. ఆయనను కుటుంబసభ్యులు  చికిత్స కోసం బుధవారం రాత్రి బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రిలో చేరారు. ఆయన్ను ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరో గ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది.  

రెబల్ స్టార్ ఆస్పత్రిలో చేరారని తెలియగానే ప్రభాస్,కృష్ణంరాజు అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. కొంతకాలంగా కృష్ణంరాజు న్యుమోనియాతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. బుధవారం రాత్రి శ్వాసకోశ సమస్య తీవ్రం కావడంతో ఆస్పత్రికి తరలించారు.