Asianet News TeluguAsianet News Telugu

వేరే మహిళతో భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఇన్‌స్పెక్టర్‌ రాజు సస్పెండ్.. వివరాలు ఇవే..

హైదరాబాద్ సౌత్ జోన్ పోలీస్ కంట్రోల్ రూమ్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న రాజుపై వేటు పడింది. రాజును సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

Hyderabad CP CV Anand Suspend inspector Raju
Author
First Published Nov 26, 2022, 5:40 PM IST

హైదరాబాద్ సౌత్ జోన్ పోలీస్ కంట్రోల్ రూమ్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న రాజుపై వేటు పడింది. రాజును సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 3న వనస్థలిపురంలో డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి చేసి దుర్భాషలాడినందుకు ఆయనపై చర్యలు తీసుకున్నారు. వనస్థలిపురంలో పార్క్ చేసిన కారులో మరో మహిళతో సన్నిహితంగా ఉన్న సమయంలో రాజును అతని భార్య పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్స్‌ను కూడా రాజు దుర్బాషలాడాడు. వివరాలు.. వనస్థలిపురంలోని ఏకాంత ప్రదేశంలో రాజు వేరే మహిళతో ఉన్న సమయంలో అతని భార్య రెడ్ హ్యాండె‌డ్‌గా పట్టుకన్నారు. ఈ క్రమంలోనే రాజును ఆమె నిలదీయడంతో అక్కడ గొడవ జరిగింది. 

అయితే గొడవ విని అక్కడికి వనస్థలిపురం పెట్రోలింగ్ పోలీసు అక్కడికి చేరుకుంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు పెట్రోలింగ్‌లో ఉన్న కానిస్టేబుల్స్ యత్నించారు. అయితే రాజు.. కానిస్టేబుల్స్‌పై దాడి చేసి గాయపరిచాడు. అంతేకాకుండా బ్రీత్-ఎనలైజర్ పరీక్ష చేయించుకోవడానికి కూడా నిరాకరించాడు. ఈ పరిణామాలు రాజును అదుపులోకి తీసుకోవడానికి దారితీశాయి. మరోవైపు తమపై దాడి గురించి కానిస్టేబుల్స్ ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసిన పోలీసులు ఇన్‌స్పెక్టర్‌గా రాజును అరెస్ట్ చేశారు. 

వనస్థలిపురం పోలీసులు వివరాల ప్రకారం.. సాగర్ కాంప్లెక్స్  ప్రాంతంలో ఇన్‌స్పెక్టర్ రాజు వేరే మహిళతో లైంగిక చర్యలో ఉండగా తాను పట్టుకున్నానని రాజు భార్య ఆరోపించారు. ఈ క్రమంలోనే రాత్రి గస్తీలో ఉన్న కానిస్టేబుళ్లు రామకృష్ణ, నాగార్జున నాయుడు ఆ విషయంలో జోక్యం చేసుకున్నారు. అయితే రాజు వారిని తిట్టాడు. వెనక్కి వెల్లిపోవాలని హెచ్చరించాడు. వారు వెనక్కి వెళ్లకపోవడంతో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో రామకృష్ణ ముఖంపై గాయాలు కూడా అయ్యాడు. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న హెడ్‌కానిస్టేబుల్ వేణు గోపాల్.. అక్కడికి చేరుకుని రాజుకు బ్రీత్-ఎనలైజర్ పరీక్ష చేసేందుకు యత్నించగా.. ఆయన ప్రతిఘటించాడు. ఆయనను కూడా తిట్టాడు. డ్యూటీ అధికారులపై దాడి చేసినందుకు రాజుపై  ఐపీసీ సెక్షన్‌లు 353, 427, 332 కింద కేసు నమోదు చేయడం జరిగింది. 

2002 బ్యాచ్ అధికారి అయిన రాజు డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారని, మునుగోడులో బందోబస్త్ డ్యూటీని కూడా కేటాయించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే రాజుపై అనుమానంతో పని ఉందని కారులో బయటకు వెళ్లిన సమయంలో..  అతని భార్య సాగర్ కాంప్లెక్స్ సమీపంలోని ఏకాంత ప్రదేశం వరకు అనుసరించి మరొక మహిళతో ఉండగా పట్టుకుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios