కాంగ్రెస్ వండిన అన్నం కేసిఆర్ తింటున్నడు : అంజన్ కుమార్ యాదవ్

hyderabad congress president anjan kumar yadav rally
Highlights

భారీ ర్యాలీ జరిపిన అంజన్ కుమార్

కాంగ్రెస్ పార్టీ వండిన అన్నాన్ని కేసిఆర్ తింటున్నాడని విమర్శించారు హైదరాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్. ఆదివారం ఆయన నగర అధ్యక్ష బాధ్యలు చేపట్టారు. అట్టహాసంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు.

రెండు సార్లు బండారు దత్తాత్రేయను ఓడించి ఎంపీ గా గెలిచాను. కోమాలో ఉన్న నగర కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి ఈ పదవి తీసుకున్నా. కాంగ్రెస్ పార్టీని జిల్లా, మండల, గ్రామ స్థాయిలో బలపరుస్తున్నాడు ఉత్తంకుమార్ రెడ్డి. కేసీఆర్ అన్నీ అబద్ధాలే చెబుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ వండిన అన్నం కేసీఆర్ తింటున్నాడు. కష్టం మనది ఫలితం కేసీఆర్ అనుభవిస్తున్నాడు. కార్పొరేట్ ఎన్నికలలో టీఆరెస్ పార్టీ టాంపరింగ్ చేసి గెలిచింది. రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తాను.

loader