Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతికి కరోనా పాజిటివ్?

హైదరాబాద్ కలెక్టర్  శ్వేతా మహంతికి కూడా కరోనా పాజిటివ్ గా తేలినట్లు సమాచారం. అధికారికంగా ప్రకటన  వెలువడకపోయినా ఆమె కరోనాతో బాధపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

Hyderabad collector Swetha Mohanty tests positive?
Author
Hyderabad, First Published Jul 17, 2020, 12:46 PM IST

హైదరాబాద్: తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తోంది. రాష్ట్రంలో సామాన్యుల దగ్గరినుండి ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ కలెక్టర్  శ్వేతా మహంతికి కూడా కరోనా పాజిటివ్ గా తేలినట్లు సమాచారం. అధికారికంగా ప్రకటన  వెలువడకపోయినా ఆమె కరోనాతో బాధపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

గతకొద్ది రోజులుగా ఆమె కలెక్టరేట్ కు రావడంలేదని  తెలుస్తోంది. అంతేకాకుండా ఇటీవల కలెక్టర్ వద్ద పనిచేసే డ్రైవర్, కలెక్టరేట్ లో పనిచేసే ఉద్యోగికి కరోనా సోకింది. ఈ క్రమంలోనే కలెక్టర్ మహంతి కూడా కరోనా బారిన పడ్డారని తెలుస్తోంది. మొత్తంగా హైదరాబాద్ కలెక్టరేట్ లో పనిచేసే 15 మంది సిబ్బంది ఇప్పటికే కరోనా బారిన పడ్డట్లు సమాచారం. 

read more   ఈ పోలీసులకు వందనం.. ఆపదలో ఉన్న వ్యక్తికి సేవలు...

మరోవైపు తెలంగాణలో కరోనా కేసులు 40 వేలు దాటాయి. గురువారం ఒక్కరోజే రాష్ట్రంలో 1,676 మందికి పాజిటివ్‌గా తేలినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 41,018 కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 13,328 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిన్న 24 గంటల్లో 1,296 మంది డిశ్చార్జ్ అయ్యారు. వీరితో కలిపి ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 27,295కి చేరింది. ఇక గురువారం వైరస్ కారణంగా పది మంది మరణించడంతో, మొత్తం మృతుల సంఖ్య 396కి చేరుకుంది.

ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే అధికంగా 788 కొత్త కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి 224, మేడ్చల్ 160, కరీంనగర్ 92, సంగారెడ్డి 57, ఖమ్మం 10, కామారెడ్డి 5, వరంగల్ అర్బన్ 47, వరంగల్ రూరల్ 1, మహబూబాబాద్ 19, మెదక్ 26, నల్గొండ 64, నాగర్ కర్నూల్ 30, నిజామాబాద్ 20, వనపర్తి 51, సూర్యాపేటలో ఐదుగురికి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

గురువారం నాడు విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో ఉచితంగా కరోనా టెస్టులు చేసే కేంద్రాలతో పాటు.. వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పడకల వివరాలను పేర్కొన్నారు.

గాంధీ మెడికల్ కాలేజీ, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి, పంజాగుట్ట నిమ్స్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం), కాకతీయ మెడికల్ కాలేజీ (వరంగల్), హైదరాబాద్ సీసీఎంబీ, సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్, ఈఎస్ఐసీ, రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్), ఆదిలాబాద్‌లో కరోనా టెస్టులు చేస్తున్నట్లు వివరించారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios