15వ అంతస్తు నుండి దూకి హెచ్‌సీయూ విద్యార్థిని ఆత్మహత్య

Hyderabad Central University student suicide
Highlights

ఓ అపార్టుమెంట్ 15 వ అంతస్తు నుండి దూకి సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. అయితే యూనివర్సిటీ క్యాంపస్ లో ఉండాల్సిన యువతి ఈ అపార్టుమెంట్ లో  ఆత్మహత్యకు పాల్పడటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గచ్చిబౌలి ప్రాంతంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అర్షిత అనే యువతి ఎంఎస్సీ చదువుతోంది. ఈమె క్యాంపస్ లోని లేడీస్ హాస్టల్లో ఉంటోంది. అయితే ఇవాళ అర్షిత నల్లగండ్ల లోని హిమసాయి అపార్ట్ మెంట్ 15వ అంతస్తు నుండి దూకి మృతిచెందింది. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు మొదలుపెట్టారు. క్యాంపస్ లో ఉండాల్సిన యువతి అపార్టుమెంట్ కు ఎందుకు వెళ్లింది, ఆమెతో పాటు ఇంకెవరైనా వెళ్లారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆత్మహత్యపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. 

loader