Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో సునీల్ కనుగోలుకు సీసీఎస్ పోలీసుల నోటీస్:తీసుకున్న మల్లు రవి


కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ కేసుకు సంబంధించి  సునీల్ కనుగోలుకును  సీసీఎస్ పోలీసులు  ఇవాళ  రోసారి నోటీసులు జారీ చేశారు.  

Hyderabad CCS Police Issues notice To Congress Strategist Sunil kanugolu
Author
First Published Dec 27, 2022, 3:22 PM IST

హైదరాబాద్: కాంగ్రెస్ వార్ రూమ్  కేసుకు సంబంధించి  ఆ పార్టీ వ్యూహకర్త  సునీల్ కనుగోలుకు  సీసీఎస్ పోలీసులు  మంగళవారంనాడు నోటీసులు జారీ చేశారు.  ఈ నోటీసులను కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ మల్లు రవి  తీసుకున్నారు.  ఈ నెల  30వ తేదీన విచారణకు రావాలని సునీల్ నుగోలును ఆ నోటీసులో  పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ పెద్దలను, మహిళలను  కించపర్చేలా  సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని   అందిన  ఫిర్యాదుల మేరకు  సునీల్  కనుగోలు సహా ఆయన టీమ్ పై  పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల  13వ తేదీన  హైద్రాబాద్ మాదాపూర్ లో  ఉన్న  సునీల్ కనుగోలు  కార్యాలయంపై  పోలీసులు సోదాలు నిర్వహించారు.  ఈ కార్యాలయంలో  ఉన్న  కంప్యూటర్లతో పాటు  సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో  పలువరు కాంగ్రెస్ నేతలు పోలీసుల తీరును ఎండగట్టారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ విషయమై  ఈ నెల  14న  రాష్ట్ర వ్యాప్తంగా  నిరసనలకు  కూడా  ఆ పార్టీ పిలపునిచ్చిన విషయం తెలిసిందే.

ఈ కేసులో  ఐదు  కేసులునమోదైనట్టుగా  హైద్రాబాద్ పోలీసులు ఈ నెల  14న ప్రకటించారు. సీసీఎస్   జాయింట్ సీపీ  గజరావ్ భూపాల్ మీడియాకు  తెలిపిన విషయం తెలిసిందే.ఈ విషయమై  సునీల్  కనుగోలు హా  మరో ముగ్గురికి  సీసీఎస్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.  ఈ నెల  26న సునీల్ కనుగోలు సహా  మరో ముగ్గురు ఆయన కార్యాలయంలో పనిచేసే సిబ్బంది  సీసీఎస్ పోలీసుల విచారణకు హాజురు కావాల్సి ఉంది. కానీ విచారణకు హాజరు కాలేదు సునీల్  కనుగోలు  ఇంతవరకు  పోలీసుల  విచారణకు అందుబాటులోకి రాలేదు. దీంతో  ఇవాళ  మరోసారి  సీసీఎస్ పోలీసులు   నోటీసులు జారీ చేశారు.  ఇవాళ మరోసారి  సీసీఎస్ పోలీసులు  సునీల్ కనుగోలుకు  నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను  కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  మల్లు రవి తీసుకున్నారు. ఈ నెల  30వ తేదీన విచారణకు రావాలని ఆ నోటీసులో  సీసీఎస్ పోలీసులు పేర్కొన్నారు.

తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి  సునీల్ కనుగోలు  వ్యూహకర్తగా  పనిచేస్తున్నారు.  సునీల్  సలహలు, సూచనల మేరకు  ఈ రెండు రాష్ట్రాల్లో ఆ పార్టీ  వ్యూహలను రచిస్తుంది.  కాంగ్రెస్ పార్టీ  సోషల్ మీడియాను కూడా  సునీల్  కనుగోలు టీమ్  నడుపుతుందని  సమాచారం.  సోషల్ మీడియాలో   అనుచిత  పోస్టులకు సంబంధించి  అందిన ఫిర్యాదుల మేరకు  పోలీసులు  ఐపీ అడ్రస్ ఆధారంగా  మాదాపూర్ లో  సునీల్  కనుగోలు  కార్యాలయం ఉన్నట్టుగా  గుర్తించారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios