బూతు చిత్రాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. వర్మకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

జీఎస్టీ సినిమా ఫై నమోదు అయిన కేసు లో తమ ముందు విచారణ కు రావాలని నోటీసుల్లో ఆదేశించారు సిసిఎస్ పోలీసులు. అయితే నేడు సీసీఎస్ ముందు వర్మ హాజరు కావాల్సి ఉంది.

తనకు నోటీసులు అందాయని వర్మ పేర్కొన్నారు. అంతేకాదు తాను విచారణ కు హాజరు కాలేనని లాయర్ ద్వారా పోలీసులకు సమాచారం ఇప్పించారు వర్మ.

ముంబై లో నాగార్జున సినిమా షూటింగ్ లో బిజి గా ఉన్నానని తెలిపారరు. వచ్చే వారం లో మళ్లీ నోటీసులు ఇస్తే పోలీసుల ముందు హాజరవుతానని వర్మ తరుపు లాయర్ తెలిపారు.

వచ్చే వారంలోగా మళ్లీ వర్మ కి నోటీసు ఇస్తామంటున్నారు పోలీసులు. మహిళల ఫై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, మహిళ ల ను పెట్టి న్యూడ్ సినిమాలు తీస్తా అని అన్నందుకే నోటీసు జారీ చేశారు పోలీసులు.