ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ పై కేసు: ప్రశ్నిస్తున్న హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు

ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ను  బుధవారం నాడు హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు.

Hyderabad CCS Police files case against IPS Officer  naveen Kumar lns

హైదరాబాద్: ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ను  బుధవారం నాడు  హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  పోలీస్ అకాడమీలో  నవీన్ కుమార్ ఎస్పీగా పనిచేస్తున్నారు.రిటైర్డ్ ఐఎఎస్ అధికారి భన్వర్ లాల్ ఫిర్యాదుతో  ఐపీఎస్ అధికారి  నవీన్ కుమార్ పై కేసు నమోదైంది.

రిటైర్డ్ ఐఎఎస్ అధికారి భన్వర్ లాల్ నివాసంలో ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ నివాసం ఉంటున్నారు. ఫేక్ డాక్యుమెంట్లతో  భన్వర్ లాల్ ఇల్లు కబ్జాకు ఎస్పీ నవీన్ కుమార్ ప్రయత్నించారని  రిటైర్డ్ ఐఎఎస్ అధికారి  భన్వర్ లాల్  పోలీసులకు ఫిర్యాదు చేశారు.నవీన్ కుమార్  తో పాటు మరో ఇద్దరు కూడ  ఈ కేసులో ఉన్నారనే ప్రచారం సాగుతుంది.  అయితే  హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు  ఈ కేసులో నవీన్ కుమార్ ను  విచారిస్తున్నారు.  

నవీన్ కుమార్ గతంలో  పని చేసిన జిల్లాల్లో కూడ  ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాతో పాటు  తెలంగాణలోని వికారాబాద్, హైద్రాబాద్ లలో కూడ నవీన్ కుమార్ ఎస్పీగా పనిచేశారు.  రిటైర్డ్  ఐఎఎస్ అధికారి భన్వర్ లాల్  కు ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ మధ్య  గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై  భన్వర్ లాల్  పోలీసులను ఆశ్రయించారు. 

 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios