తప్పుడు బిల్లులతో సీఎంఆర్ఎఫ్ నిధుల స్వాహా: నలుగురిపై కేసు


తప్పుడు బిల్లులతో  సీఎంఆర్‌ఎఫ్   నిధులను స్వాహా చేస్తున్న విషయమై  పోలీసులు  కేసు నమోదు  చేశారు.  

 Hyderabad CCS Police Case Against fake bills to claim money from CM Relief Fund lns

హైదరాబాద్: తప్పుడు బిల్లులతో  సీఎంఆర్ఎఫ్ నిధులను డ్రా  చేసిన  అంశంపై  నలుగురిపై  కసు నమోదైంది. అంతేకాదు  రెండు ఆసుపత్రులపై  కూడ  పోలీసులు కేసు పెట్టారు.  నకిలీ బిల్లులతో   డబ్బులను డ్రా  చేస్తున్నారని  అంది న ఫిర్యాదుపై  హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు  కేసు పెట్టారు. 

ఖమ్మం, నల్గొండ  జిల్లాకు  చెందిన   రెండు  సూపర్ స్పెషాలిటీ  ఆసుపత్రులపై  పోలీసులు  కేసు నమోదు  చేశారు.  నల్గొండ జిల్లాకు  చెందిన జ్యోతి, లక్ష్మి, శివ, ధిరావత్ పై  కేసులు  నమోదు  చేశారు  పోలీసులు .

తప్పుడు  బిల్లులతో  సుమారు రూ.  6లక్షలను  క్లెయిమ్  చేసినట్టుగా  పోలీసులు గుర్తించారు. ఆసుపత్రులకు  ఎల్ఓసీ  ఇప్పించి  ఆ నిధులను  నిందితులు  ఆసుపత్రి  యాజమాన్యం  పంచుకుందని  గుర్తించారు.చికిత్స  చేయకుండానే  నకిలీ బిల్లులు సృష్టించారని  అధికారులు గుర్తించారు.  రూ. 30 నుండి  రూ. 40 వేల వరకు  నకిలీ బిల్లులను తయారు  చేశారని  అధికారులు  తమ దర్యాప్తులో  గుర్తించారు.

 నకిలీ  బిల్లులతో  సీఎంఆర్ఎఫ్ నిధుల స్వాహా విషయమై  తెలంగాణ సచివాలయానికి చెందిన  రెవిన్యూ అధికారి  మూర్తి  పోలీసులకు  ఫిర్యాదు  చేశారు. తొలుత  సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో  ఈ విషయమై కేసు నమోదు  చేశారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ నుండి ఈ కేసును  సీసీఎస్ కు బదిలీ చేశారు.   గతంలో  కూడ ఇదే తరహలో  తప్పుడు బిల్లులతో  సీఎంఆర్ఎఫ్  నిధులను స్వాహా  చేసిన ఘటనలు  తెలుగు రాష్ట్రాల్లో చోటు  చేసుకున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios