ఇటీవలి కాలంలో టీఆర్ఎస్ నేతలు వరుసగా వివాదాల్లో నిలుస్తున్నారు. కామారెడ్డిలో తల్లీ కొడుకుల ఆత్మహత్య, ఖమ్మంలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్య ఘటనల్లో టీఆర్ఎస్ నేతల ప్రమేయంపై ఆరోపణలు ఉన్నాయి. తాజాగా అధికార పార్టీకి చెందిన మరో నాయకుడు కూడా వార్తల్లో నిలిచాడు. 

ఇటీవలి కాలంలో టీఆర్ఎస్ నేతలు వరుసగా వివాదాల్లో నిలుస్తున్నారు. కామారెడ్డిలో తల్లీ కొడుకుల ఆత్మహత్య, ఖమ్మంలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్య ఘటనల్లో టీఆర్ఎస్ నేతల ప్రమేయంపై ఆరోపణలు ఉన్నాయి. తాజాగా అధికార పార్టీకి చెందిన మరో నాయకుడు కూడా వార్తల్లో నిలిచాడు. టీఆర్‌ఎస్‌ కూకట్‌పల్లి కోఆర్డినేటర్‌ సతీష్‌ అరోరా తనను వేధింపులకు గురిచేశాడనే ఆరోపిస్తూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. సతీష్ తనపై వేధింపులకు పాల్పడుతున్నాడని 30 ఏళ్ల మహిళ సైబరాబాద్ కమిషనర్ కార్యాలయాన్ని ఆశ్రయించింది. 

కేపీహెబీ ప్రాంతంలో తన ఇంటి పక్కన సతీష్ చేపట్టిన నిర్మాణ పనులపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో అతడు కొన్ని నెలల క్రితం తనను వేధించడం ప్రారంభించారని మహిళ తెలిపింది. అతని వేధింపులు భరించలేక వేరే ప్రాంతానికి వెళ్లిపోయినట్టుగా చెప్పింది. అక్కడే బోటిక్ నడపడం ప్రారంభించానని.. అయితే సతీష్ నుంచి మాత్రం వేధింపులు కొనసాగుతూనే వ్చాయని తెలిపింది. తనను ఇబ్బంది పెట్టాలని.. బోటిక్ పక్కనే ఉన్న దుకాణాల యజమానులకు సతీష్ ప్రేరేపించాడని ఆరోపించింది. అంతేకాకుండా తనపై బెదిరింపులకు పాల్పడ్డాడని తెలిపింది. 

ఈ క్రమంలోనే ధైర్యం తెచ్చుకున్న బాధిత మహిళ సోమవారం సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. ఘటన జరిగిన ప్రాంతం కేపీహెబ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రావడంతో ఆమె ఫిర్యాదును అక్కడికి పంపించారు. దీంతో సతీష్‌పై మహిళను వేధించాడనే ఆరోపణలపై బుధవారం కేసు నమోదైంది. మహిళ ఫిర్యాదుతో సెక్షన్‌ 354 కింద కేసు నమోదు చేసినట్లు కూకట్‌పల్లి ఏసీపీ చంద్రశేఖర్‌ తెలిపారు. ఇక, ఈ కేసుకు సంబంధించి బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితుడు సతీష్‌ను బీజేపీ నాయకులు బుధవారం కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌ ముందు ధర్నా నిర్వహించారు. 

మరోవైపు కామారెడ్డిలో రామాయంపేటకు చెందిన సంతోష్, అతని తల్లి పద్మ ఆత్మహత్య పాల్పడిన కేసుకు సంబంధించి ఏడుగురు నిందితుల్లో.. ఆరుగురిని పోలీసులు బుధవారం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వీరిలో రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరి కూడా ఉన్నారు. మొత్తం ఆరుగురు నిందితులకు మేజిస్ట్రేట్ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అయితే ఈ కేసులో మరో నిందితుడు సీఐ నాగార్జున గౌడ్‌ను మాత్రం పోలీసులు ఇంకా అరెస్ట్ చేయలేదు.